Begin typing your search above and press return to search.
వైఫ్ తో పూర్తయ్యాక బ్రదర్ తో..
By: Tupaki Desk | 9 Jun 2017 7:27 PM ISTనిజంగా హీరో సూర్య ను చూసి స్టార్ హీరోలు చాలా నేర్చుకోవచ్చు. మామూలుగా కొన్ని స్టార్ ఫ్యామిలీస్ పెద్దోళ్లు సినిమాలు రూపొందిస్తారు కాని.. వాళ్ళ ఫ్యామిలీలోని ఇతర హీరోలతో కాకుండా బయట హీరోలతో తీస్తుంటారు. కాని సూర్య మాత్రం.. తన బ్యానర్ 2డి ఎంటర్టయిన్మెంట్ తో ముందు తన ఫ్యామిలీకే బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
ఆల్రెడీ తన వైఫ్ కోసం ఇప్పటికే రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు సూర్య. తొలి సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ఇప్పుడిక ఈ బ్యానర్ పై తన తమ్ముడితో కూడా ఒక సినిమాను చేస్తాడట. 2009లో పసంగ సినిమాను తీసి నేషనల్ అవార్డును కొట్టేశాడు డైరక్టర్ పాండిరాజ్. ఈ మధ్యకాలంలో పెద్దగా కమర్షియల్ సక్సెస్ లు కొట్టలేదు కాని.. ఇది నమ్మ ఆలు వంటి సినిమాలతో బాగానే అలరిస్తున్నాడు. ఇప్పుడు మనోడు కార్తి హీరోగా ఒక సినిమాను తీస్తాడట. ఈ మధ్యకాలంలో కార్తికి కూడా కమర్షియల్ హిట్స్ లేవు. కాబట్టి ఈ సినిమాతో తమ్ముడు కార్తికి.. అన్న సూర్య సొంత బ్యానర్ కి.. అలాగే దర్శకుడు పాండిరాజ్ కు బ్రేక్ వస్తుందేమో చూడాలి.
ఈ మధ్యన వచ్చిన ఊపిరి.. కాష్మోరా.. చెలియా సినిమాలు తెలుగులో కూడా కార్తికి పెద్దగా బ్రేక్ ఇవ్వలేకపోయాయి. మరి ఇప్పటికైనా తెలుగు మార్కెట్ కు కూడా నచ్చే కథను ఎంచుకుంటాడనే అనుకుందాం. లేకపోతే అవారాతో వచ్చిన క్రేజ్ అంతా అవారాగా గాల్లో కలిసిపోతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/