Begin typing your search above and press return to search.

సూర్యని విమానమే కాపాడాలి

By:  Tupaki Desk   |   26 Sept 2019 1:01 PM IST
సూర్యని విమానమే కాపాడాలి
X
ఒకప్పుడు టాలీవుడ్ లో 30 కోట్ల మార్కెట్ ని ఎంజాయ్ చేసి ఇప్పుడు 3 కోట్లు తేవడమే కష్టమే అన్న రీతిలో ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసుకున్న సూర్య మీద ట్రేడ్ లో ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో తనను అభిమానించే వారు మాత్రం ఇప్పటికీ ఉన్నారు. ఇటీవలే వచ్చిన బందోబస్త్ సైతం అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. కెవి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ ఏ కోణంలోనూ మనవాళ్ళను కనీస స్థాయిలో మెప్పించలేకపోయింది.

జరిగిన బిజినెస్ తక్కువే అయినా అందులో సగం వచ్చినా గొప్పే అనేలా వసూళ్లు చాలా నెమ్మదించాయి. దీనికన్నా ముందు వచ్చిన ఎన్జికె సైతం ఇదే ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సూర్య బలంగా కం బ్యాక్ అవ్వాలి అంటే ఇప్పుడు షూటింగ్ లో ఉన్న సూరారై పోట్రు సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. కానీ ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు . ఒక బయోపిక్. భారతదేశ విమానయాన రంగంలో సెన్సేషన్ గా నిలిచిన ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాథ్ నిజ జీవిత కథ ఆధారంగా ఇది రూపొందుతోంది.

గురు ఫేమ్ సుధా కొంగర దర్శకురాలు. సూర్యనే నిర్మాత. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేశారు. తెలుగులోనూ డబ్బింగ్ చేయబోతున్నారు. అపర్ణ బాలమురళి ఇందులో హీరోయిన్. ఇది బ్లాక్ బస్టర్ అయితే సూర్య మళ్ళీ తను పోగొట్టుకున్న మార్కెట్ తిరిగి సంపాదించుకోగలడు. కానీ ఇలాంటి కథలు మాస్ కు అంతగా అప్పీల్ కావు కాబట్టి ఏ మేరకు సూరారై పోట్రు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇంకా తెలుగు టైటిల్ నిర్మాతలు ఎవరో డిసైడ్ కాలేదు. చాలా బ్యాడ్ ఫేజ్ లో ఉన్న సూర్యను ఇప్పుడు తక్షణం కాపాడాల్సింది ఈ విమానమే.