Begin typing your search above and press return to search.

ఆరవసారి కొత్తగా ట్రై చేయబోతున్నారు

By:  Tupaki Desk   |   6 Oct 2020 6:00 AM IST
ఆరవసారి కొత్తగా ట్రై చేయబోతున్నారు
X
తమిళ స్టార్‌ డైరెక్టర్‌ హరి మరియు స్టార్‌ హీరో సూర్యలు ఇప్పటి వరకు అయిదు సినిమాలు కలిసి చేశారు. అందులో మూడు సినిమాలు సింగం సిరీస్ నుండి వచ్చినవే. మిగిలిన రెండు సినిమాలు ఆరు మరియు వేల్ సినిమాలు. అయిదు సినిమాలు కూడా విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందినవే. అయితే అన్ని కూడా మాస్‌ ఆడియన్స్‌ కు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు హరి తెరకెక్కించాడు. వీరిద్దరి కాంబోలో ఆరవ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సింగం సిరిస్‌ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. మరో మూవీ వీరిద్దరి కాంబో వస్తే అది సింగం 4 అవుతుందని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో రాబోతున్నది 'సింగం' సినిమా కాదట.

ఇప్పటికే చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఉండేలా అంటే ఫ్యామిలీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కథతో దర్శకుడు హరి మరియు సూర్యలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సూర్య ఎప్పుడు కూడా కొత్త తరహా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఈసారి హరితో చేయబోతున్న సినిమా ఎవరి ఊహకు అందనంత విభిన్నంగా ఉండాలని భావిస్తున్నాడట. అలాంటి కథతో రావాల్సిందిగా హరికి సూర్య ఇప్పటికే సూచించాడట. ప్రస్తుతం అలాంటి కథ కోసం హరి కసరత్తులు చేస్తున్నాడు. త్వరలో సూర్య ఆకాశమే నీ హద్దురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత సూర్య తదుపరి సినిమా విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.