Begin typing your search above and press return to search.

ఎందుకు సూర్య ఈ ప్రయోగాలు!!

By:  Tupaki Desk   |   22 Nov 2016 11:30 AM GMT
ఎందుకు సూర్య ఈ ప్రయోగాలు!!
X
కొంతమంది హీరోలంతే తమకు సూట్ కావని తెలిసినా మళ్లీ మళ్లీ అదే జోనర్లో ప్రయోగాలు చేస్తుంటారు. కలిసొచ్చే కథలు వదిలేసి కొత్తగా ట్రై చేయాలని ఆరాటపడి దెబ్బైపోతుంటారు. తమిళ్ హీరో సూర్య ఇప్పుడు ఇలాంటి రాంగ్ రూట్ లోనే వెళుతున్నాడా అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఫస్ట్ టైమ్ సెల్వరాఘవన్ తో టై అప్ అవుతున్న సూర్య గాడ్ ఫాదర్ టైప్ ఆఫ్ స్టోరీ చేయబోతున్నాడని కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇదే అభిమానుల్ని కంగారు పెడ్తోంది.

నిజానికి సింగమ్ సిరీస్ హిట్స్ తప్ప ఈ మధ్య సూర్య ఫామ్ గొప్పగా ఏమీ లేదు. 24 మూవీతో కాస్త ట్రాక్ లో పడ్డాడనిపిస్తోంది. సింగమ్ త్రీతో ఇంకో బ్లాక్ బస్టర్ పక్కా అనుకుంటున్నారు. ఇక విఘ్నేష్ శివన్ అంటే జోనర్ ఏదైనా కామెడీ పక్కా కాబట్టి తానా సెరందా కూటమ్ హిట్టవుతుందని నమ్మకంగా ఉన్నారు. అయితే ఎటోచ్చి సెల్వ రాఘవన్ చెబుతున్న గ్యాంగ్ స్టర్ స్టోరీలైనే ఇప్పుడు ఫ్యాన్స్ ని భయపెట్టేస్తోంది. అసలే సూర్యకి గ్యాంగ్ స్టర్ కథలు కలిసిరాలేదని అంజాన్ ని గుర్తు చేసుకొంటున్నారు.

లింగుస్వామి తీసిన అంజాన్ సూర్య కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్. అయినా సరే సూర్య మరోసారి గ్యాంగ్ స్టర్ అవతారమెత్తడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టున్నాడు. బహుశా సెల్వరాఘవన్ డైరెక్టర్ కావడం వల్ల డేర్ చేస్తున్నట్టున్నాడు. అయితే సెల్వ రాఘవన్ సినిమాలు టూ క్రిటికల్ గా ఉంటాయ్. అర్థమైతే సూపర్ హిట్.. లేకపోతే అట్టర్ ఫ్లాప్. సో తీసే ప్రతీ సినిమాతో హిట్ కొడతాడనే గ్యారంటీ ఉండవు సెల్వ సినిమాలు. పైగా తాను కూడా ఫ్లాప్స్ లో ఉన్నాడు. మరి సూర్య- సెల్వరాఘవన్ కాంబినేషన్లో ఎలాంటి మూవీ రాబోతుందో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/