Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో 5 ఏళ్ల ఎదురు చూపులకు తెర దించేనా?

By:  Tupaki Desk   |   9 March 2022 2:30 AM GMT
స్టార్‌ హీరో 5 ఏళ్ల ఎదురు చూపులకు తెర దించేనా?
X
తమిళ స్టార్‌ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ ఆకాశమే నీ హద్దురా మరియు జై భీమ్ సినిమాలతో సూపర్‌ హిట్స్ ను దక్కించుకున్నాడు. కాని ఆ రెండు సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల అవ్వడంతో అభిమానులు పెద్దగా హ్యాపీ అవ్వలేదు. సూర్య సినిమాలు థియేట్రికల్ రిలీజ్‌ అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకుని చాలా కాలం అయ్యింది. దాదాపు అయిదు సంవత్సరాల క్రితం సింగం సిరీస్ లో వచ్చిన సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాల్లో ఒకటి రెండు పర్వాలేదు అనిపించినా మొత్తానికి మాత్రం కమర్షియల్ గా బిగ్గెస్ట్‌ సక్సెస్ లు అందుకోక చాలా కాలం అయ్యింది. తెలుగు లో కూడా గతంలో చాలా సినిమాలతో సక్సెస్ లను దక్కించుకున్న ఈ అరవ స్టార్‌ హీరో అక్కడ ఇక్కడ మంచి ఫ్యాన్‌ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. కాని వరుస ప్లాప్‌ ల వల్ల ఇక్కడ మార్కెట్‌ కాస్త తగ్గింది. ఈ వారంలో ఈటీ సినిమా తో అక్కడ ఇక్కడ ఒకే సారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సూర్య సిద్దం అయ్యాడు.

సూర్య థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండున్నర సంవత్సరాలకు పైగానే అయ్యింది. ఆయన మద్యలో రెండు ఓటీటీ సినిమాలను తీసుకు వచ్చి సూపర్‌ హిట్‌ అయ్యాడు. ఒక వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఈటీ సినిమా తో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

సూర్య అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు ఈ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు పాండిరాజ్ దర్శకత్వం వహించడం తో తమిళనాట మరింతగా అంచనాలు ఉన్నాయి. ఈటీ సినిమా తో తెలుగు లో కూడా మరోసారి తన సక్సెస్‌ జర్నీని మొదలు పెట్టాలనే ఉద్దేశ్యంతో సూర్య తమిళనాట ఎంతగా అయితే ప్రచారం చేశాడో ఇక్కడ కూడా అదే స్థాయిలో ప్రచారం చేయడం జరిగింది.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌ సినిమాకు పోటీ అన్నట్లుగా రాబోతున్న ఈటీ సినిమా ను జనాలు ఎలా ఆధరిస్తారు అనేది చూడాలి. అయిదు సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేయడంలో విఫలం అవుతూ వచ్చిన సూర్యకు ఈ సినిమా ఎంత మేరకు సక్సెస్ ను.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ను రాబడుతుంది అనేది తెలియాలంటే మరో రెండు రోజుల వరకు వెయిట్‌ చేయాల్సిందే.