Begin typing your search above and press return to search.

సూర్య `ఈటి` వేట షురూ అయింది!

By:  Tupaki Desk   |   28 Feb 2022 1:30 AM GMT
సూర్య `ఈటి` వేట షురూ అయింది!
X
కోలీవుడ్ హీరో సూర్య బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా ఓటీటీలో త‌న సినిమాల్ని రిలీజ్ చేస్తూ విజ‌యప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. `స‌రూరై పొట్టు` త‌ర్వాత ఇటీవ‌లే జైభీమ్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన రెండు సినిమాలు పెద్ద విజ‌యాన్ని సాధించాయి. ఇక `జైభీమ్` చిత్రాన్ని మెచ్చ‌ని ప్రేక్ష‌కులు లేరు. ఆస్కార్  రేంజ్  మూవీ అంటూ కితాబులు అందుకున్నారు.

తాజాగా సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఎత్త‌రాకం తున్నైదావ‌న్` చిత్రం తెలుగులో `ఈటి` టైటిల్ తో అనువాద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 10న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతుంది.

తాజాగా రిలీజ్ తేదిని ఖ‌రారు చేస్తూ యూనిట్ సూర్య కొత్త పోస్ట‌ర్  ని రిలీజ్ చేసింది. ఎరుపు ష‌ర్ట్..తెల్ల పంచె క‌ట్టి ఈటి బ‌రిలోకి దిగుతున్నాడు. `ఎవ‌రికి త‌ల‌వంచ‌డు` అనేది  ట్యాటెగ్ లైన్.  ట్యాగ్ లైన్ బ‌ట్టి సూర్య పాత్ర ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుందో గెస్ చేయోచ్చు. మ‌రోసారి మాస్ యాంగిల్ లో సూర్య వీర ఊతుకు త‌ధ్యంగా క‌నిపిస్తోంది. ఇందులో సూర్య‌కి జోడీగా  ప్రియాంక మోహ‌న‌న్ న‌టించింది.

ఇక ఈ సినిమా  తెలుగు అనువాద హ‌క్కుల్ని ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్ స్ ప్ర‌యివేట్ లిమిటెడ్ ద‌క్కిచుకుంది.   ఈ సినిమాకి  తెలుగు వెర్ష‌న్ ఆయ‌నే డ‌బ్బింగ్ సూర్య  చెబుతుండ‌టం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కూ డ‌బ్బింగ్ ఆర్టిస్టుల‌ పై ఆధార‌ప‌డిన  సూర్య `ఈటి` విష‌యంలో తానే స్వ‌యంగా రంగంలోకి దిగుతున్నారు.

ప్ర‌స్తుతం  కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ లో సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్..విజ‌య్ లు ఇప్ప‌టికే టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌తో క‌మిట్ అయి ఉన్నారు. భ‌విష్య‌త్ లో పోటీ త‌ప్ప‌దు. ఇప్ప‌టి నుంచే అన్ని ర‌కాలు స‌న్న‌ధం కావాలి. దీంతో సూర్య‌  ఇవ‌న్నీ విశ్లేషించుకుని గొంతు స‌వ‌రించ‌డానికి రెడీ అయిన‌ట్లు చెప్పొచ్చు. ఈ సినిమాలో స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. ఇమ్మాన్ సంగీతం స‌మ‌కూర్చారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అందించారు.