Begin typing your search above and press return to search.

'ఈటీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. 'రాధేశ్యామ్' తో పోటీ తప్పదా..?

By:  Tupaki Desk   |   1 Feb 2022 4:30 PM GMT
ఈటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. రాధేశ్యామ్ తో పోటీ తప్పదా..?
X
తెలుగులో మార్కెట్ ఏర్పరచుకున్న కొద్దిమంది తమిళ హీరోల్లో సూర్య ఒకరు. తాను నటించే ప్రతీ చిత్రాన్ని ఇక్కడ కూడా రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఎత్తారెక్కుమ్ తునిందవన్'' (ఈటీ) కూడా తెలుగులో రిలీజ్ కానుంది.

'ఈటీ' సూర్య కెరీర్ లో 40వ సినిమా. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని ముందుగా ఫిబ్రవరి 4న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే కరోనా నేపథ్యంలో మరోసారి రీషెడ్యూల్ చేశారు.

'ET' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 10న థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ని వదిలారు. ఇందులో సూర్య కత్తి పట్టుకొని కోపంగా నడుచుకుంటూ వస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

అయితే మార్చి 11న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రేపో ఎల్లుండో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఒక్క రోజు తేడాతో ప్రభాస్ తో సూర్య సినిమా బాక్సాఫీస్ వద్ద తలపడాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.

'ఆకాశమే హద్దురా' 'జై భీమ్' వంటి బ్యాక్ టూ బ్యాక్ ఓటీటీ రిలీజుల తర్వాత.. సూర్య బిగ్ స్క్రీన్ పై కనిపించే సినిమా కావడంతో అభిమానులు ''ఈటీ'' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సూర్య ఊరమాస్ పాత్రలో కనిపించనున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చగా.. తమిళ హీరో శివ కార్తికేయన్ - దర్శకనిర్మాత విఘ్నేశ్ శివన్ పాటలకు సాహిత్యం అందించడం విశేషం. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. జాకీ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

సత్యరాజ్ - సూరి - జయప్రకాశ్ - శరణ్య పొన్వన్నన్ - వినయ్ రాయ్ - సుబ్బు పంచు - దేవదర్శిని - ఎం.ఎస్ భాస్కర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య - పాండిరాజ్ కాంబినేషన్ లో గతంలో ‘పసంగ’ (మేము) అనే సినిమాని వచ్చింది. మరి ఇప్పుడు వీరి కలయికలో రాబోతున్న 'ఎత్తారెక్కుమ్ తునిందవన్' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.