Begin typing your search above and press return to search.

సూర్య 'గ్యాంగ్'తో వస్తున్నాడు

By:  Tupaki Desk   |   25 Nov 2017 5:35 AM GMT
సూర్య గ్యాంగ్తో వస్తున్నాడు
X
కోలీవుడ్ హీరోల్లో రజినీకాంత్ తర్వాత తెలుగులో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోల్లో సూర్య ఒకరు. ఈ హీరో సినిమాలకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. సూర్య మూవీస్ రిలీజ్ అయితే చాలు ఇక్కడ స్టార్ హీరోలు అందుకునే ఓపెనింగ్స్ ని అందుకుంటాడు. ఒక్కోసారి హౌస్ ఫుల్ కలెక్షన్స్ నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక నటనలోను ఈ హీరో తక్కువేమి కాదు ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో చేసి మెప్పిస్తాడు.

అయితే సూర్య హిట్టు కొట్టి చాలా కాలమే అవుతోంది. మధ్యలో కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా సూర్య రేంజ్ కలెక్షన్స్ ని మాత్రం రాబట్టలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ ని టచ్ చేసి మళ్లీ సక్సెస్ ట్రాక్ లో పడాలని చూస్తున్నాడాట సూర్య. ప్రస్తుతం ఈ తమిళ హీరో స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో 'థాన సెర్ధ కూటమ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు తెలుగులో ఒక పవర్ఫుల్ టైటిల్ అనుకుంటున్నారట. 'గ్యాంగ్' అంటూ ఈ సినిమాను పిలవబోతున్నారట. ఈ సినిమాపై ప్రస్తుతం కోలీవుడ్ లో అంచనాలు బాగానే ఉన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ.. కార్తిక్ వంటివారు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇకపోతే సినిమాను తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ యూవీ క్రియేషన్స్ సినిమాను గ్యాంగ్ అనే పేరుతో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. మొదటి సారి యూవీ క్రియేషన్స్ ఒక డబ్బింగ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఇక సినిమాను సంక్రాంతి తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ అందించాడు. రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయిన ఒక పాట చాలా హిట్ అయ్యింది. త్వరలో మరోక పాటని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.