Begin typing your search above and press return to search.
పోల్ రిపోర్ట్: 2020 సౌత్ ఇండియా బెస్ట్ హీరో..?
By: Tupaki Desk | 25 Dec 2020 12:30 AM GMT2020 సంవత్సరం సినీ ఇండస్ట్రీ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ కనీవినీ ఎరగని నష్టాలను చవి చూసింది. గత ఫిబ్రవరిలో వచ్చిన ఈ వైరస్ ప్రభావం ఏడాది చివరి వరకు కొనసాగింది. మొదటి రెండు నెలలు కొన్ని సినిమాలు థియేటర్స్ లో సందడి చేయగా.. మిగతా పది నెలలు హోమ్ థియేటర్స్ లో సినిమాలు సందడి చేశాయి. 2020 ఫస్ట్ క్వార్టర్ లో టాలీవుడ్ లో 'సరిలేరు నీకెవ్వరు' 'అల వైకుంఠపురంలో' 'భీష్మ' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. మిగతా సినిమాలన్నీ ఓటీటీలలో విడుదల కాబడ్డాయి. సౌత్ ఇండస్ట్రీ మొత్తంగా చూసుకుంటే 2020లో సినిమాల సంఖ్య తక్కువే.. అలానే సక్సెస్ రేట్ కూడా తక్కువే. ఈ ఏడాది విడుదలైన సినిమాల పరంగా సౌత్ ఇండియా బెస్ట్ హీరో అని 'తుపాకీ డాట్ కామ్' పోల్ పెట్టగా క్రింది విధంగా ఫలితాలు వచ్చాయి.
ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అత్యధిక ఓట్స్ రాబట్టి ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్య నటనకు ఓటీటీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ ఏడాది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా సూర్య కెరీర్ బెస్ట్ గా నిలిచింది. అందుకే సూర్య ను బెస్ట్ హీరోగా 36.42 శాతం మంది నిర్ణయించారు. ఇక రెండో స్థానంలో 28.84 శాతం ఓట్లతో అల్లు అర్జున్ నిలిచాడు. 'అల వైకుంఠపురంలో' సినిమాతో కెరీర్ బెస్ట్ అందుకున్న బన్నీ.. ఈ సినిమాతో అనేక రికార్డులు తిరగరాసాడు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 16.13 శాతంతో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక 'ట్రాన్స్' సినిమాతో అందరినీ ట్రాన్స్ లోకి తీసుకెళ్లిన ఫహద్ ఫాసిల్(6.92%) నాలుగో స్థానంలో నిలిచాడు. అలానే 'అయ్యప్పనుమ్ కోశీయుమ్' తో హిట్ అందుకున్న పృథ్వీరాజ్ 5.23 శాతంతో తర్వాతి ప్లేస్ లో ఉన్నాడు. ఇక 'భీష్మ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్(3.62%).. 'కనులు కనులను దోచాయంటే' హీరో దుల్కర్ సల్మాన్(2.83%) వారిని అనుసరించారు.