Begin typing your search above and press return to search.

సౌత్ స్టార్ హీరో ప‌రిస్థితి ఎందుకిలా..

By:  Tupaki Desk   |   30 Sep 2019 1:30 AM GMT
సౌత్ స్టార్ హీరో ప‌రిస్థితి ఎందుకిలా..
X
త‌మిళ హీరో సూర్య‌కు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. శివ‌పుత్రుడు- గ‌జిని చిత్రాల‌తో సూర్యను తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో అభిమానించారు. త‌న‌దైన లుక్ .. మ్యాన‌రిజం.. న‌ట‌న‌తో తెలుగులో మంచి మార్కెట్ ను ఏర్ప‌ర‌చుకున్న సూర్య‌కు ఇటీవ‌ల ఊహించ‌ని స‌న్నివేశం ఎదుర‌వుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన `బందోబ‌స్త్‌` ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో జీరో చేసేసి అత‌ని కెరీర్ లోనే అత్యంత భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా వారం తిర‌క్కుండానే డిజాస్ట‌ర్ గా డిక్లేర్ అయిపోయింది. ఆడుతుంది అనుకున్న‌ది కాస్తా ఇలా నిరాశ‌ప‌రుస్తుంద‌ని ఊహించ‌లేదు.

తొలి వారాంతంలో 1.75 ల‌క్ష‌ల షేర్ ని మాత్ర‌మే తెలుగు రాష్ట్రాల్లో రాబ‌ట్ట‌గ‌లిగింది అంటే సీన్ అర్థం చేసుకోవ‌చ్చు. స్టార్ ఇమేజ్ వున్న సూర్య సినిమా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల షేర్ ని కూడా అధిగ‌మించ‌క‌పోవ‌డం త‌న‌ స్థాయికి త‌గ్గ‌ట్టుగా లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. చాలా డీగ్రేడ్ తెలుగు సినిమాల‌ వ‌సూళ్ల‌ని కూడా సూర్య బందోబ‌స్త్ అధిగ‌మించ‌క‌పోవ‌డం ఉభ‌య తెలుగు రాష్ట్ర‌ల్లో త‌గ్గిన అత‌ని క్రేజ్ కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ఈ సినిమాకు ముందు వ‌చ్చిన `ఎన్‌జీకే` వ‌సూళ్లు బెట‌ర‌న్న మాటా వినిపిస్తోంది. `బందోబ‌స్త్‌` దెబ్బ‌తో సూర్య తెలుగులో త‌న మార్కెట్‌ని కోల్పోయాడ‌న్న‌ది ఖాయ‌మైంది.

ఈ పరిస్థితికి కార‌ణం సూర్య ఎంచుకున్న ప‌స లేని క‌థ‌లు.. ద‌ర్శ‌కులేన‌ని అర్థ‌మ‌వుతోంది. గ‌త కొంత కాలంగా కెరీర్ విష‌యంలో ఫుల్ క‌న్ ఫ్యూజ‌న్‌లో వున్న సూర్య అన్ని వ‌ర్గాల వ‌ర్గాల్ని ఆక‌ట్టుకునే క‌థ‌ల్ని కాకుండా క్రియేటీవ్ క‌థ‌ల‌వైపు వెళ్ల‌డ‌మే అత‌ని కెరీర్ ని ఈ స్థాయికి తీసుకొచ్చింద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికైనా ఆ క‌న్ ఫ్యూజ‌న్ వీడి అంద‌రికి ఆమోద యోగ్య‌మైన క‌థ‌ల‌వైపు అడుగులు వేస్తే సూర్య కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని సినీ పండితులు చెబుతున్నారు.