Begin typing your search above and press return to search.

ఫ్లాప్ లో ఉన్నా వదలని సూర్య.. సాహసమే!

By:  Tupaki Desk   |   12 Oct 2022 11:30 AM GMT
ఫ్లాప్ లో ఉన్నా వదలని సూర్య.. సాహసమే!
X
తమిళ చిత్రపరిశ్రమలలోనే కాకుండా తెలుగు సినిమా ప్రపంచంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న సూర్య గతంలో మాదిరిగా అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకోవడం లేదు. అతని చివరి 5 సినిమాలు కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. కేవలం ఓటీటీలో విడుదలైన ఆకాశం నీ హద్దురా సినిమా మాత్రమే మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ సూర్యకు ఇప్పుడు థియేట్రికల్ గా మాత్రం ఒక సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే అతను పట్టుబట్టి సక్సెస్ కొట్టాలి అనే తరహాలో అయితే కనిపించడం లేదు. ఎప్పటిలాగే తన ప్రయోగాలతో ముందుకు సాగుతున్నాడు. అందులోను ఫామ్ లో లేని దర్శకులను అతను సెలెక్ట్ చేసుకుంటూ ఉండడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

వీలైనంతవరకు ప్రయోగత్మకమైన సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫిక్స్ అయినట్లు అనిపిస్తోంది. ఇక తన కెరీర్ కు ఒక మంచి ట్రాక్ సెట్ చేసిన విలక్షణ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

శివ పుత్రుడు సినిమాలో విక్రమ్ తో పాటు సూర్య కూడా తమిళంలో మంచి గుర్తింపు అందుకున్నారు. అయితే బాల గత కొంతకాలంగా వరుస అపజయాలతో సతమతమవుతూ ఉండగా అతన్ని పిలిచి మరి సొంత ప్రొడక్షన్లో సినిమాను మొదలు పెట్టాడు. అయితే మరోవైపు తన కెరీర్ కు అసలైన బాక్స్ ఆఫీస్ సక్సెస్ చూపించిన ఏఆర్ మురుగదాస్ కు కూడా ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

వీరి కలయికలో వచ్చిన గజిని సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా సూర్య మార్కెట్ను ఒక్కసారిగా పెంచింది. ఇక ఇప్పుడు గజిని సీక్వెల్ చేసేందుకు సూర్య దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మురగదాస్ కూడా గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో తన మార్కెట్ను కోల్పోయాడు. దీంతో అతనితో సినిమాలు చేసేందుకు ఇతర స్టార్ హీరోలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక ఇప్పుడు సూర్య అతనికి ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి సూర్య ఇచ్చిన అవకాశంతో ఈ ఇద్దరు దర్శకులు మళ్లీ ఫామ్ లోకి వస్తారో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.