Begin typing your search above and press return to search.

సూర్య ఫ్యామిలీ పిక్ క్యూట్ గా ఉందే!

By:  Tupaki Desk   |   13 Sept 2019 11:21 AM IST
సూర్య ఫ్యామిలీ పిక్ క్యూట్ గా ఉందే!
X
తమిళంలోనే కాకుండా సౌత్ మొత్త మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. ఈమధ్య అయన సినిమాలు తెలుగులో నిరాశపరుస్తున్నాయి కానీ ఆయనను అభిమానించేవారు ఇప్పటికీ ఉన్నారు. ప్రొఫెషనల్ లైఫ్ లో Mr పర్ఫెక్ట్ అన్నట్టుగా వ్యవహరించే సూర్యకు పర్సనల్ లైఫ్ లో కూడా Mr. పర్ఫెక్ట్ ఇమేజ్ ఉంది. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబం తో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు.

రీసెంట్ గా సూర్య -జ్యోతిక దంపతులు తమ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. 2006 లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం. పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్. మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా సింపుల్ గా కేక్ కట్ చేస్తున్న ఫోటోలను జ్యోతిక తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో సూర్య ఫ్యామిలీ అంతా క్యాజువల్ డ్రెస్ లో ఉన్నారు. పిల్లలేమో బ్యాడ్ మింటన్ బ్యాట్స్ చేతులో పట్టుకొని ఆట గ్యాప్ లో కేక్ కటింగ్ కు హాజరయినట్టున్నారు. అందరి దృష్టి కేక్ మీద ఉంది కానీ సూర్య దృష్టి మాత్రం కెమెరా మీద ఉంది. ఏదేమైనా ఫోటో మాత్రం భలే క్యూట్ గా ఉంది కదా?

ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాప్పాన్'(బందోబస్త్) ఈ నెల ఇరవైన రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కాకుండా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కే 'సూరారై పొట్రు' చిత్రంలో కూడా నటిస్తున్నాడు.