Begin typing your search above and press return to search.

తమ్ముడి షూటింగ్ చూసిన అన్నయ్య

By:  Tupaki Desk   |   1 Feb 2018 11:29 AM IST
తమ్ముడి షూటింగ్ చూసిన అన్నయ్య
X
సౌత్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్య బ్రదర్ కార్తీ ప్రతి సినిమాలో ఎదో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. కథ కొత్తగా ఉంటే దర్శకుడికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడంలో కార్తీ ఎప్పుడు ముందే ఉంటాడు. అయితే అదే తరహాలో రీసెంట్ గా ఒక సరికొత్త కథను తన అన్నయ్య హోమ్ ప్రొడక్షన్ లోనే నిర్మిస్తున్నాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్ పాండి రాజ్ దర్శకత్వంలో కార్తీ నటిస్తోన్న కడైకుట్టి సింగం అనే సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందట స్టార్ట్ అయ్యింది.

రీసెంట్ గా షూటింగ్ కి సంబందించి ఫోటోలని కూడా అన్నయ్య సూర్యా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. సినిమాకు సంబంధించి చిత్రీకరణలో భాగంగా రెక్లా పోటీలను నిర్వహించారు. అందులో కార్తీ కొన్ని యాక్షన్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా చేశాడు. అయితే సూర్యా అతని కుమారుడు దేవ్ తో కలిసి కార్తీ షూటింగ్ ని దగ్గరి నుండి చూశారు. అనంతరం కొని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అంతే కాకుండా ఒక స్వీట్ కామెంట్ కూడా పెట్టాడు. చిన్నతనంలో నా మనసులో అలా పదిలంగా నిలిచిపోయిన ప్రాంతాలను నా కుమారుడితో కలిసి చూశా.. నిజంగా చాలా సంతోషంగా ఉందని సూర్య తన భావనను తెలిపాడు. ఇక కడైకుట్టి సినిమాలో హీరోయిన్ గా సాయిషా కథానాయికగా నటిస్తుండగా 2డీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ప్రొడక్షన్ సినిమాను నిర్మిస్తోంది.