Begin typing your search above and press return to search.

బాలయ్యకు గజిని షాక్ ఇస్తాడంటారా?

By:  Tupaki Desk   |   24 Jan 2016 9:00 PM IST
బాలయ్యకు గజిని షాక్ ఇస్తాడంటారా?
X
బాలకష్ణ 99వ సినిమా డిక్టేటర్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సమయంలోనే.. వందో సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చేసి, ఫ్యాన్స్ ని ఖుషీ చేసేసారు. ఆదిత్య 369కి కొనసాగింపుగా మూవీ చేయబోతున్నట్లు తేల్చేశారు. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించనుండగా.. ఇప్పుడో కోలీవుడ్ హీరో నుంచి బాలయ్య మూవీకి సమస్య ఎదురు కానుంది.

ప్రస్తుతం కోలీవుడ్ లో సూర్య 24 పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగులో మనం చిత్రాన్ని తీసిన విక్రమ్ కుమార్ ఈ 24కి డైరెక్టర్. ఇది టైం మెషీన్ ఆధారిత కథ అని తెలుస్తోంది. అలా టైం చుట్టూరా తిరిగే స్టోరీ కావడంతోనే.. ఇరవైనాలుగు గంటలకు గుర్తుగా 24 అనే టైటిల్ సెట్ చేశారు. ప్రస్తుతం చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో.. సూర్య డ్యుయల్ రోల్ కూడా చేస్తుండడం విశేషం. ఈ ఏడాది సమ్మర్ నాటికి 24 విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే బాలయ్య చేయనున్న ఆదిత్య 999 కూడా టైం మెషీన్ చుట్టూ తిరిగే కథే. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ కూడా రెడీగా ఉండడంతో.. వీలైనంత త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసేయనున్నారు. తన కెరీర్ లోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆదిత్య 999 తీర్చిదిద్దాలన్నది బాలకృష్ణ ఆలోచన. అందుకోసం గ్రాఫిక్ వర్క్ ని కూడా బాగానే ప్లాన్ చేశారు.

ఇప్పుడు సందేహం ఏంటంటే.. ఒకవేళ సూర్య 24.. బాలయ్య ఆదిత్య 999 ఒకేలా ఉంటే ఏంటి పరిస్థితి? బాలయ్య బాబు ముందే షూటింగ్‌ కు వెళ్లిపోయాడనుకోండి.. ఇంతలో సూర్య సినిమా విడుదలై బాలయ్య కథను డిస్ట్రబ్‌ చేస్తే? అప్పుడు సూర్య 'రాక్షసుడు' రిలీజయ్యాక ఎలాగైతే నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా కథను చాలావరకు చేంజ్‌ చేశారో.. బాలయ్య కూడా చేంజ్‌ చేసుకోవాల్సి వస్తుందేమో. ఈ మధ్యన అందరూ బ్యాక్‌ డ్రాప్‌ మార్చేసి ఒకటే హాలీవుడ్‌ కథను కాపీ కొట్టేస్తుంటే.. ఈ ప్రాబ్లం తలెత్తుతోంది. ఒకవేళ సింగీతం సరి కొత్త కథను ఇస్తే.. ఈ ప్రాబ్లం రాదులే.