Begin typing your search above and press return to search.

మంచు మ‌నోజ్ సినిమాలో మెగా మేన‌ల్లుడు?

By:  Tupaki Desk   |   21 March 2021 3:30 AM GMT
మంచు మ‌నోజ్ సినిమాలో మెగా మేన‌ల్లుడు?
X
హీరో మంచు మ‌నోజ్ ఎం.ఎం.ఆర్ట్స్ బ్యాన‌ర్ స్థాపించి ఇందులో తొలిగా `అహం బ్ర‌హ్మ‌స్మి` అనే సినిమాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త కుర్రాడిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఏడాది కాలంగా ఈ మూవీ షూటింగ్ పైనే మ‌నోజ్ దృష్టి సారించారు. క‌రోనా మ‌హ‌మ్మారీ వ‌ల్ల కొన్ని నెల‌ల పాటు వాయిదా ప‌డినా.. తాజాగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణకు మ‌నోజ్ ప‌క్కాగా ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేశార‌ని తెలిసింది.

ఇక ఈ మూవీ టైటిల్ కి త‌గ్గ‌ట్టే అహంకారం ఒక‌ మ‌నిషికి ఎంత ప్ర‌మాద‌క‌రమో తెర‌పై చూపిస్తున్నార‌ట‌. తాజా స‌మాచారం మేర‌కు.. ఈ చిత్రంలో మెగా మేన‌ల్లుడు సాయి తేజ్ ఓ అతిథి పాత్ర‌లో న‌టిస్తార‌ని నిడివి స్వ‌ల్ప‌మే అయినా కానీ క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర ఇద‌ని కూడా చెబుతున్నారు. నిమిషం పాటు సాయి తేజ్ మెరుపులాంటి స‌న్నివేశంలో క‌నిపిస్తార‌ట‌.

ఇక మెగా హీరోల‌తో మ‌నోజ్ స్నేహం గురించి తెలిసిందే. చ‌ర‌ణ్ .. బ‌న్ని స‌హా మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కి అత‌డు చాలా క్లోజ్. మ‌నోజ్ సినిమాల‌కు వీరంతా ప్ర‌చార సాయం చేస్తుంటారు. ఇప్పుడు స్నేహితుడు అడ‌గ్గానే సాయి తేజ్ అతిథి పాత్ర‌కు వెంట‌నే ఓకే చెప్పార‌ని తెలుస్తోంది. ఎం.ఎం.ఆర్ట్స్ లో న‌వ‌త‌రానికి అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హిస్తాన‌ని మ‌నోజ్ ఇంత‌కుముందు తెలిపారు. ఈ చిత్రంలో కొత్త‌వారికి అవ‌కాశ‌మిచ్చారు.