Begin typing your search above and press return to search.

ఏకధాటిగా రెండు సినిమాలను ఫినిష్ చేస్తున్న స్టార్ డైరెక్టర్!

By:  Tupaki Desk   |   16 March 2021 5:00 AM IST
ఏకధాటిగా రెండు సినిమాలను ఫినిష్ చేస్తున్న స్టార్ డైరెక్టర్!
X
మెగాహీరో వైష్ణవ్ తేజ్.. నటించిన మొదటి సినిమా ఉప్పెన విడుదలకు ముందే తన రెండో సినిమా కంప్లీట్ చేసాడు. గతేడాది లాక్డౌన్ సమయంలోనే ఆ సినిమా షూటింగ్ పూర్తిచేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా కొండపోలం అనే పేరుతో ప్రచారంలో ఉన్న ఆ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వైష్ణవ్ జోడిగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ ఎక్కువశాతం వికారాబాద్ అడవుల్లో జరిపినట్లు తెలుస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు ముస్తాబు అవుతోంది.

అలాగే డైరెక్టర్ క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'హరిహరవీరమల్లు' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇటీవలే శివరాత్రి సందర్బంగా చిత్రబృందం టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుగా ఎంట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. ఫస్ట్ గ్లింప్స్ సినిమా పై మరిన్ని భారీ అంచనాలను క్రియేట్ చేసింది. చారిత్రాత్మక సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపిస్తాడని టాక్. అయితే డైరెక్టర్ క్రిష్ ఓ వైపు కొండపోలం పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటూనే మరోవైపు వీరమల్లు షూటింగ్ వేగవంతం చేసాడు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫర్నేండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.