Begin typing your search above and press return to search.

వీడియో: స్పృహలోకి వచ్చిన సాయి తేజ్..!

By:  Tupaki Desk   |   11 Sept 2021 6:29 PM IST
వీడియో: స్పృహలోకి వచ్చిన సాయి తేజ్..!
X
మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తేజ్ తన స్పోర్ట్స్ బైక్‌ పై మాదాపూర్‌ లో కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. రోడ్డు మీద ఉన్న ఇసుక వల్ల బైక్ స్కిడ్ అవడంతో అదుపుత‌ప్పి పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి తేజ్ ను.. మాదాపూర్ పోలీసులు వెంటనే సమీపంలోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రధాన అవయవాలు పనిచేస్తున్నామని.. ఐసీయూలో చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.

అయితే మెడికవర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్న సమయంలోనే సాయి తేజ్ స్పృహలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఐసీయూలో చికిత్స జరుపుతున్న సమయంలో తేజ్ స్పందించాడని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో తేజ్ ను డాక్టర్ కళ్ళు తెరవండి అంటూ కదిలించగా.. ఆ సమయంలో సాయి తేజ్ తన చేతులను కదిలిస్తూ ఉన్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం అపోలో ఐసీయూలో ఉన్న సాయి తేజ్ కు స్పృహ వచ్చినట్లు తెలుస్తోంది. వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడిన తేజ్.. 'నొప్పిగా ఉంది' అనే ఒక్క మాట మాత్రమే మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. సాయితేజ్ దగ్గరకి డాక్టర్లు ఎవరినీ అనుమతివ్వడం లేదని.. కేవలం వీడియో కాల్ ద్వారానే అందరూ పరమర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సాయి తేజ్ వైద్యానికి స్పృహలోకి వచ్చాడనే కథనాలు వస్తుండటంతో ఆయన త్వరగా ఇంటికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.