Begin typing your search above and press return to search.

సైజుల విషయంలో స్వీటి తేడాకొట్టేసిందే

By:  Tupaki Desk   |   27 Nov 2016 3:49 AM GMT
సైజుల విషయంలో స్వీటి తేడాకొట్టేసిందే
X
సైజ్ జీరో కోసం లావుగా మారిపోయి.. తర్వాత తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతున్న అనుష్క సైజ్ విషయంలో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్.. హోప్స్ ఉన్నాయా? అయితే ఓ సారి కచ్చితంగా రీసెంట్ గా రిలీజ్ అయిన సింగం సీక్వెల్ ఎస్3 సాంగ్ ప్రోమో చూడాల్సిందే.

'ముదల్ మురయా' అంటూ సాగే పాటకు సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది సింగం టీం. ఫస్ట్ ఫ్రేమ్ లోనే స్వీటీ సైజుల విషయంలో ఓ ఐడియా వస్తుంది కానీ.. ఏమైనా తగ్గిందేమో అనే ఆశలు ఉన్నవారికి పాట ప్రారంభం కాగానే విషయం అర్ధమైపోతుంది. ఇంచ్ కాదు కదా.. కనీసం మిల్లీ మీటరు కూడా తగ్గలేదని.. అయినా సరే అనుష్కను లాంగ్ షాట్స్ లో చూపించి కవర్ చేసేందుకు ట్రై చేశారనే విషయం అర్ధమైపోతుంది. హీరో హీరోయిన్స్ ని దూరదూరంగా నిలబెట్టి పాట తీయడం.. ఒకవేళ దగ్గరగా చూపించాల్సి వస్తే.. సైడ్ యాంగిల్ లో చూపించడంతోనే.. స్వీటి సైజుల విషయంలో ఎంత తేడాకొట్టేసిందో తెలిసిపోతోంది.

మోడ్రన్ డ్రస్సులతో మేనేజ్ చేద్దామని చేసిన ప్రయత్నం కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. సింగం3లో స్వీటీని ఇలా చూసిన తర్వాత.. ఫ్యాన్స్ చాలా మంది ఉసూరుమనేస్తున్నారు. ఇక లావుగా ఉన్నా మా హీరోయిన్ బాగా ట్యాలెంటెడ్ అని చెప్పుకోవాల్సిందే అనుకుంటా!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/