Begin typing your search above and press return to search.

రాక్ ఆన్ 2.. రఫ్పాడించేశారు

By:  Tupaki Desk   |   8 Sep 2016 5:42 AM GMT
రాక్ ఆన్ 2.. రఫ్పాడించేశారు
X
రాక్ ఆన్ 2.. గత కొంత కాలంగా బాలీవుడ్ లో ఈ మూవీ హాట్ టాపిక్. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన రాక్ఆన్ మంచి సక్సెస్ నే సాధించగా.. టేకింగ్ - పిక్చరైజేషన్ పరంగా చాలానే సంచలనాలను సృష్టించింది. ఇప్పుడు మళ్లీ రాక్‌ ఆన్2 ని లైన్ లో పెట్టడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి కలిగింది.

ఫర్హాన్ అక్తర్..శ్రద్ధా కపూర్ లు లీడ్ రోల్స్ లో నటించగా.. అర్జున్ రాంపాల్.. ప్రాచీ దేశాయ్.. పూరబ్ కోహ్లి.. శశాంక్ అరోరాలు కీలక పాత్రల్లో నటించారు. ఫర్హాన్ పాత్ర తన మ్యూజిక్ బ్యాండ్ ను మళ్లీ తీసుకురావడంతో ట్రైలర్ ప్రారంభించగా.. ఆ తర్వాత శ్రద్ధా కపూర్ కు పాటలు పాడాలని క్లాస్ తీసుకుంటాడు. ఇక శంకర్-ఎహ్ సాన్-లాయ్ అందించిన మ్యూజిక ఈ మూవీకి ప్రాణం అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

స్టోరీ పరంగా కొత్తగా ఉన్నట్లు అనిపించక పోయినా.. ప్రెజెంటేషన్ పరంగా డిఫరెంట్ గానే రాక్ ఆన్ కనిపిస్తోంది. అయితే.. ఎక్కువ భాగం షిల్లాంగ్ లోనే షూటింగ్ చేసేయడం కొంత నిరుత్సాహం కలిగించే విషయం. ఇలాంటి లోపాలను మ్యూజిక్ తో కవర్ చేసేసిన సంగతి ట్రైలర్ లో అర్ధమవుతుంది. నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది రాక్ ఆన్2.