Begin typing your search above and press return to search.
#DRUGS సుశాంత్ బాగా వాడుకుని బుక్ చేశాడన్న రియా!
By: Tupaki Desk | 23 Sept 2020 11:01 PM ISTడ్రగ్స్ కేసులో రియా బెయిల్ పిటీషన్ విచారణ ముంబైలో అధిక వర్షాల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసినదే. అయితే బెయిల్ పిటీషన్ లో రియా పేర్కొన్న అంశాలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. మరోసారి యథావిధిగా దివంగత నటుడు సుశాంత్ సింగ్ పై రియా తీవ్ర ఆరోపణలు చేసింది.
తనను తన సోదరుడిని సుశాంత్ డ్రగ్స్ కోసం ఫుల్ గా వాడుకుని ఇప్పుడిలా బుక్ చేశాడని ఆరోపించింది. దీనివల్ల తాను మానసిక క్షోభను అనుభవిస్తున్నానని రియా వెల్లడించింది. ``సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు పుష్కలంగా ఉంది. అతడి సర్కిల్ లో డ్రగ్స్ తీసుకునేది అతనొక్కడే. డ్రగ్స్ తీసుకురావాలని తన స్టాఫ్ ను బలవంతం చేసేవాడు. నన్ను. నా సోదరుడు షోవిక్ ను కూడా డ్రగ్స్ కోసం పిలిచేవాడు. అతడు ఎలాంటి ఆధారాలు మిగల్చకపోవడంతో మేం బుక్కయ్యాం`` అంటూ రియా కలత చెందింది. ఇక తక్కువ మోతాడులో డ్రగ్స్ సేవించిన సుశాంత్ బతికి ఉంటే కేవలం ఏడాది జైలుతోనే బయటపడేవాడని రియా పేర్కొంది.
ఆత్మహత్యకు మూడు రోజుల ముందు వంటవాడిని డ్రగ్స్ రెడీ చేయాల్సిందిగా సుశాంత్ కోరాడట. అతడు బాక్స్ లో పెట్టిన డ్రగ్స్ ని అతడు వినియోగించాడని కూడా రియా వెల్లడించింది. మరణించిన రోజు వంటవాడైన నీరజ్ ఆ బాక్స్ తెరిచి చూస్తే అది ఖాళీగా ఉందట. ఈ వివరాలన్నిటినీ రియా సీబీఐ విచారణలో చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఇప్పటివరకూ సుశాంత్ సింగ్ వాట్సాప్ చాట్లను కానీ.. మెసేజ్ లను కానీ బయటపెట్టకపోవడం వెనక తనను తన సోదరుడిని బలి పశువుల్ని చేసే కుట్ర దాగి ఉందని రియా ఆరోపించింది.