Begin typing your search above and press return to search.

మ‌హోన్న‌త వీడ్కోలు ఇవ్వ‌క‌పోతే ఉమ్మేసుకున్న‌ట్టే!

By:  Tupaki Desk   |   12 Sep 2022 4:50 AM GMT
మ‌హోన్న‌త వీడ్కోలు ఇవ్వ‌క‌పోతే ఉమ్మేసుకున్న‌ట్టే!
X
ఆర్జీవీ ఎమోష‌న్ అయ్యారంటే దానికో లెక్క ఉంటుంది! ఆయ‌న ఎన్నిసార్లు తిక్క చూపించినా కానీ త‌న‌కంటూ ఒక లెక్క‌ ఉంద‌ని నిరూపించిన ఘ‌నుడు. ఇప్పుడు రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మ‌ర‌ణం వేళ అత‌డి స్పంద‌న అంద‌రినీ ఆలోచింప‌జేసింది.

ఎన్నో గొప్ప చిత్రాల్లో న‌టించి నిర్మించిన గ్రేట్ కృష్ణంరాజు మ‌ర‌ణం వేళ తెలుగు సినిమా తారలు ఇత‌రుల‌ స్వార్థాన్ని ఆయ‌న సూటిగా ప్రశ్నించారు. ఒక రకంగా ఇండ‌స్ట్రీని నిల‌దీసే ప్ర‌య‌త్నం చేసారు.

కృష్ణంరాజు మ‌ర‌ణించాక షూటింగుల‌కు సెలవు ప్రకటించకపోవడం తెలుగు చిత్ర పరిశ్రమ త‌ప్పిద‌మ‌ని ఇంత‌ స్వార్థపూరితంగా మారడం సిగ్గుచేటు అని రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు.

కృష్ణంరాజు మృతి పట్ల తన వేదనను వ్యక్తం చేస్తూ ఆదివారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు. ఆయ‌న‌ స్థాయికి త‌గ్గ‌ట్టు గౌర‌విస్తూ అంత్యక్రియలు చేయాల‌ని మ‌హోన్న‌త‌ వీడ్కోలు ఇవ్వడంలో టాలీవుడ్ విఫలమైతే అది మన ముఖాలపై మనమే ఉమ్మివేయడం లాంటిదని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

అంతేకాదు స్టార్లంద‌రినీ ట్విట్ట‌ర్ లో ట్యాగ్ చేసి మీక్కూడా ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. కృష్ణ- చిరంజీవి- మహేష్- పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ వంటి వారి మరణానంతరం వారికి కూడా ఇలాంటి భవిష్యత్తు రిపీట‌వుతుంద‌ని భయపెడుతూ ప‌రిశ్ర‌మ‌ని నిందించాడు. ''మీ మరణానికి విలువ ఇవ్వాలంటే కృష్ణంరాజు వంటి లెజెండ్ మరణానికి విలువ ఇవ్వాలి'' అని వర్మ అన్నారు.

కాస్ట్ కంట్రోల్ అంటూ దాదాపు నెల రోజులు సెలవు తీసుకున్న టాలీవుడ్ ని దెప్పి పొడిచారు. కృష్ణంరాజు కోసం రెండు రోజులు సెలవు తీసుకోదా? అని వర్మ నిల‌దీసారు. చాలా సంద‌ర్భాల్లో లాజిక్ లేకుండా మాట్లాడే వ‌ర్మ ఈసారి మాత్రం గొప్ప లాజిక్ తో తెర‌పైకొచ్చాడు. మ‌న స్టార్ల స్వార్థ పూరిత ఆలోచ‌న‌ల‌ను బాగానే నిల‌దీసాడు. అన్న‌ట్టు వ‌ర్మ త‌న సినిమా షూటింగుల‌కు నిజాయితీగానే సెల‌వు తీసుకున్నార‌ని అంతా అనుకుంటున్నారు!!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.