Begin typing your search above and press return to search.
మెగాస్టార్ కే ఆఫర్ ఇచ్చిన ఐటం భామ!
By: Tupaki Desk | 24 March 2022 6:00 AM ISTచెన్నై బ్యూటీ రెజీనా టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కంది. కానీ ఆ దిశగా సక్సెస్ కాలేదు. మీడియం రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కెరీర్ ప్రారంభిచి 15 ఏళ్లు దాటింది. కోలీవుడ్ ..టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. దాదాపు మీడియం హీరోలందర్నీ కవర్ చేసింది. కానీ బిగ్ స్టార్స్ సరసన మాత్రం అవకాశాలు అందుకోవడంలో ఇప్పటికీ వెనుకబడే ఉంది. టైమ్ కలసిరాకే బ్యూటీకి అలా జరిగుండచ్చు. అయితే మీడియం బడ్జెట్ సినిమాలతో మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంది.
ఇప్పటికీ వచ్చిన అవకాశాలు విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం తెలుగు..తమిళ్ లో కలిపి ఐదారు సినిమాలు చేస్తోంది. అయితే రాకా రాక వచ్చిన ఒకే ఒక్క అతి పెద్ద అవకాశం మెగాస్టార్ చిరంజీవి సరసన. ఆయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులోరెజీనాకి చిరంజీవి సరసన ఐటం భామగా నటించే అవకాశం దొరికింది.
ఎంతో మంది హాట్ భామలున్నా రెజీనానే ఆ ఆఫర్ వచ్చింది. ఆ రకంగా రెజీనా లక్కీ గాళ్ అనే చెప్పాలి. అయితే ఈ ఆఫర్ కేవలం చిరంజీవి కారణంగానే ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలిపింది. మరో హీరో అయితే వెంటనే నో చెప్పేసేదాన్ని అని అంటోంది. చిరంజీవి గ్రేస్ ఫుల్ డాన్సర్. అతనితో కలిసి నటించడం మంచి ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది.
చిరంజీవి సార్ టైమ్ పంక్చువాల్టీ తెలుసు. ఆయన ఏ సమయంలో ఏం చేయాలనుకుంటే అది చేసేస్తారు. సెట్ లో టైమ్ కి ఉంటారు. ఆయనతో పనిచేసేవారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. నా కెరీర్ లో ఇదే మొదటి-చివరి ఐటం సాగ్ కూడా. చిరంజీవి గారు కాబట్టే ఆ పాటలో నటించడానికి అంగీకరించాను. గతంలో కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ వాటలిని సున్నితంగా తిరస్కరించాను`` అని తెలిపింది.
రెజీనా వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. షాహిద్ కపూర్- విజయ్ సేతుపతి నటించిన కృష్ణ డీకే హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. సీజన్ -1లో తన పాత్ర ఫరిది తక్కువగా ఉంటుందని..అందులో విజయ్ సేతు పతి భార్య పాత్ర పోషిస్తున్నట్లు తె లిపింది. అలాగే `రాకెట్ బోయ్స్` అనే మరో వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది.
`టైప్ కాస్ట్` గురించి మాట్లాడుతూ.. టైప్ కాస్ట్ అనేది అన్ని సమయాల్లోనూ జరుగుతుంది. 14 ఏళ్ల వయసులో మొదటిసారి సినిమాల్లో నటించాను. సిస్టర్ గర్భవతి పాత్రలో నటించాను. ఆ తర్వాత కొన్ని తమిళ్ సినిమాల్లో హీరోల చెల్లెలి పాత్రలో నటించాను.నట జీవితంలో ఏ దశలోనైనా టైప్ కాస్ట్ జరుగుతుందని` తెలిపింది.