Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసికి అంత బజ్ అందుకేనా

By:  Tupaki Desk   |   9 Jan 2018 11:14 AM IST
అజ్ఞాతవాసికి అంత బజ్ అందుకేనా
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు సినిమాలు విడుదలయ్యే ప్రపంచంలోని ప్రతీ ప్రాంతంలో ఇప్పుడు అజ్ఞాతవాసినే హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే.. వీటికి ఏమాత్రం తగ్గకుండా అజ్ఞాతవాసి పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ సైట్స్ లో అజ్ఞాతవాసి తొలి రోజు టికెట్ బుకింగ్ దొరకడం అసాధ్యంగా మారింది. ఆన్ లైన్ కి వచ్చేవే అరాకొరా టికెట్స్ అయితే.. అవి కూడా నిమిషాల వ్యవధిలోనే ఫుల్ అయిపోతున్నాయి. ఇక సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి చెప్పాల్సిన పనే లేదు. ఇంతకీ అజ్ఞాతమూవీకి ఇంత హైప్ ఎందుకా అనిపించక మానదు. నిజానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ జనాలు కూడా బుకింగ్స్ కోసం చూస్తుండడమే ఇందుకు కారణం అని చెప్పేయచ్చు. ఈ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అని ప్రచారం ముందు నుంచి జరిగినా.. ఇదే ఆఖరి చిత్రం కావచ్చనే టాక్ ఉంది. తన తర్వాతి ప్రాజెక్టు గురించి పవన్ నోరు విప్పకపోవడం.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా చేస్తాడో చేయడో అనే డౌట్స్ చాలామందిలో ఉన్నాయి.

పైగా త్రివిక్రమ్ తో పవన్ మూవీ ఇప్పుడప్పుడే చూసే అవకాశం ఆడియన్స్ కు చిక్కదు. అందుకే అజ్ఞాతవాసికి ఇంత విపరీతమైన బజ్ కనిపిస్తోందని ట్రేడ్ జనాలు అంటున్నారు. తొలి రోజు ఈ చిత్రం షేర్ వసూళ్ల అంచనాలు ఇఫ్పుడు 50 కోట్లకు చేరిపోయాయి.