Begin typing your search above and press return to search.
పదికోట్లు వెనక్కిచ్చేసిన హీరో
By: Tupaki Desk | 7 Jan 2016 3:00 PM ISTపారితోషకాలు వెనక్కిచ్చేసే పెద్ద మనసు మన తెలుగు హీరోలకే కాదండోయ్.. బాలీవుడ్ హీరోలకూ ఉంది. చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ కూడా ఈ విషయంలో తన పెద్ద మనసు చాటుకున్నాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ ఈ కపూర్ వారసుడు తన కొత్త సినిమా ‘తమాషా’కు రూ.30 కోట్లకు పైనే పారితోషకం అందుకున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఫ్లాప్ హీరోకు అంత రెమ్యూనరేషనా అంటూ గుసగుసలాడుకున్నారు జనాలప్పుడు. ఐతే పారితోషకం తీసుకోవడంలోనే కాదు.. ఇచ్చేయడంలోనూ తన స్థాయి ఏంటో రణబీర్ చూపించాడు.
‘తమాషా’ ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడంతో నిర్మాణ సంస్థ యూటీవీకిభారీ నష్టం వాటిల్లడంతో తన పారితోషకంలోంచి రూ.10 కోట్లు వెనక్కి ఇచ్చేశాడట రణబీర్. తన మాజీ ప్రియుడు అంత ఉదారత చూపించినపుడు దీపిక మాత్రం ఎలా సైలెంటుగా ఉంటుంది? ఆమె కూడా తాను తీసుకున్న రూ.12 కోట్ల పారితోషకంలోంచి రూ.5 కోట్లు తిరిగిచ్చేసిందట. మొత్తానికి హీరో హీరోయిన్ల పెద్ద మనసుతో నష్టంలో ఓ 15 కోట్లు మిగుల్చుకుంది యూటీవీ సంస్థ. రూ.75 కోట్ల భారీ బడ్జెట్ తో ఇంతియాజ్ అలీ రూపొందించిన ఈ చిత్రం రూ.50 కోట్ల లోపే వసూలు చేసినట్లు అంచనా. ‘తమాషా’కు మంచి టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం దక్కలేదు.