Begin typing your search above and press return to search.
డ్రగ్స్ పై నిజంగానే స్టోరీ చేశాడట పూరి
By: Tupaki Desk | 4 Sept 2017 10:34 PM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ వ్యవహారం ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. విచారణ కోసం రవితేజ - పూరి జగన్నాథ్ లాంటి స్టార్లని పిలవడం సంచలనంగా మారింది. కొన్నాళ్లపాటు ఎక్కడ చూసినా దాని గురించే చర్చ. పోలీసులు విచారణ కోసం ఇండస్ట్రీ జనాల్ని పిలిపించినన్ని రోజులూ మీడియాలో అదే హాట్ టాపిక్. సినిమా వ్యక్తి ఎవరు కనిపించినా మీడియా డ్రగ్స్ గురించే ప్రశ్నలు సంధించేది. ఆ క్రమంలోనే స్టార్ దర్శకుడు సుకుమార్ కి కూడా ఓ ప్రశ్న ఎదురైంది.
ఆయన అందరికంటే డిఫరెంట్ గా సమాధానం ఇచ్చారప్పట్లో. ``పూరి జగన్నాథ్ ని చూసి జెలసీగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో ఇప్పటికే ఆయనకి ఓ మంచి స్టోరీ వచ్చుంటుంది`` అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే పూరి డ్రగ్స్ కేసు - ఆ సమయంలో మీడియా చేసిన హడావుడి నేపథ్యంలో ఓ కథ తయారు చేశాడట. ఆ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు పూరి. సమయం వచ్చినప్పుడు సినిమా తీస్తానని స్పష్టం చేశాడు. పూరి ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. ఆయనకి ఓ చిన్న పాయింట్ దొరికితే చాలు.. కథ అల్లేస్తాడు. అలాంటిది అంత పెద్ద వ్యవహారానికి తానే ప్రత్యక్షసాక్షి అయితే ఇక వదిలిపెడతాడా? మరి పూరి ఆ సినిమాని ఎప్పుడు తీస్తాడో చూడాలి. ఎప్పుడు మొదలుపెట్టినా అది సంచలనమైన ప్రాజెక్టుగా మారిపోతుందనడంలో డౌటు లేదు.