Begin typing your search above and press return to search.

షూటింగ్‌ షురూ కాకుండానే ఆయన గురించి చాలా చెప్పేస్తుంది

By:  Tupaki Desk   |   29 July 2021 5:00 AM IST
షూటింగ్‌ షురూ కాకుండానే ఆయన గురించి చాలా చెప్పేస్తుంది
X
బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ గురించి ఇండస్ట్రీలో నలుగురు నాలుగు రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆయన బ్యాడ్‌ బాయ్ అంటూ కొందరు ఆయన బంగారు మనసు ఉన్న మనిషి అంటూ మరి కొందరు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మొత్తానికి ఆయన ఒక మంచి వ్యక్తి అని మాత్రం ఎక్కువ శాతం అంటూ ఉంటారు. తాజాగా ఆయన గురించి టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ పూజా హెగ్డే వ్యాఖ్యలు చేసింది. సల్మాన్‌ ఖాన్‌ ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటూ వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా సల్మాన్ ఖాన్‌ తో వర్క్‌ చాలా కంఫర్ట్‌ గా ఉంటుందని తెలుసుకున్నాను అంటూ కూడా వ్యాఖ్యలు చేసింది.

సల్మాన్ ఖాన్‌
తాజా చిత్రం భైజాన్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపిక అయ్యింది. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అవ్వాల్సి ఉండే. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. గత కొన్ని నెలలుగా సల్మాన్‌ ఖాన్‌ తో షూటింగ్‌ లో పాల్గొనేందుకు పూజా హెగ్డే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చిన్నప్పటి నుండి ఆయన్ను చూస్తూ పెరిగిన తాను ఆయన పై తనకు ఉన్న అభిమానంను ఆయన ముందు ఉంచాలని ఆశ పడుతున్నట్లుగా ఆమద్య ఒక చిట్ చాట్ లో పేర్కొంది. ఆ సందర్బం కోసం ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్న ఈ అమ్మడు తాజాగా మరోసారి ఇంట్రెస్టింగ్‌ వ్యాఖ్యలు చేసింది.

సల్మాన్ ఖాన్‌ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరోటి మాట్లాడడు అని.. ఆయన నిజాయితీగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అంటూ పూజా చెప్పుకొచ్చింది. ఇంకా ఆయనతో షూటింగ్‌ లో జాయిన్ కాకుండానే ఆయన గురించి ఇంతగా చెప్పేస్తుంది అంటే ఆయన తో సినిమా పూర్తి చేసిన తర్వాత మరెంతగా ఆయన గురించి వ్యాఖ్యలు చేస్తుందో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు అంటున్నారు.

ఇక తెలుగు లో ఈమె నటించిన రాధే శ్యామ్‌ మరియు మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్‌ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది. తమిళంలో మరియు హిందీలో ఈమె చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్న ఆఫర్లు ఈ ఏడాది వచ్చాయి. మొత్తంగా మూడు భాషల్లో కూడా ఈ అమ్మడు బిజీ బిజీగా నటిస్తోంది.