వీడియో : 55 ఏళ్ల వయసుకు కూడా ఈ డెడికేషన్ ఏం డెడికేషన్ బాసూ

Thu Jul 22 2021 10:34:15 GMT+0530 (IST)

Salman Khan Dedication At The Age Of 55

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు 55 ఏళ్ల వయసులో కూడా కష్టపడుతున్నాడు. కండల వీరుడు అనిపించుకునేందుకు ఇంకా కూడా ఈ బాలీవుడ్ స్టార్ కష్టపడుతున్నాడు. పెద్ద ఎత్తున ఈయన చేస్తున్న వర్కౌట్ ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహజంగా నాలుగు పదుల వయసులో పడగానే ఎవరైనా కూడా ఒక రకమైన నిస్థేజంలోకి వెళ్లి పోతారు. కాని సల్మాన్ ఖాన్ మాత్రం ఆరు పదుల వయసుకు దగ్గర కు వచ్చినా కూడా ఇంకా కండల కొండను కరుగకుండా చూసుకుంటూ ఉన్నాడు.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అద్బుతమైన తన ఫిజిక్ ను మరింతగా పెంచుకునేందుకు సల్మాన్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ తాజాగా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం టైగర్ 3 కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరో వైపు  సల్మాన్ ఖాన్ తన బాడీని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. మామూలుగానే సల్మాన్ ఖాన్ కండలు చూస్తే అబ్బో అనేట్లుగా ఉంటాయి. టైగర్ 3 లో మాత్రం అంతకు మించి అన్నట్లుగా ఉంటాయనే టాక్ వినిపిస్తుంది.

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చేస్తున్న వర్కౌట్లు ఆయన్ను టైగర్ 3 లో కొత్తగా చూపించడం ఖాయం అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు. సల్మాన్ ఖాన్ కొత్త ఫిజిక్ ను చూసేందుకు మీరు రెడీగా ఉన్నారా అంటూ బాలీవుడ్ కు చెందిన సల్మాన్ ఖాన్ సన్నిహితులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం 55 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఈ డెడికేషన్ బాసూ అంటూ సల్మాన్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.