Begin typing your search above and press return to search.
తాత కోసం మనవడు పరుగులు ఇలా!
By: Tupaki Desk | 29 May 2023 4:00 PMవిశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు మే 20న ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులంతా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించి ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే అందులో ముద్దుల మనవడు..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కనిపించలేదు. దీంతో అభిమానులు సహా మీడియాలో నూ తారక్ ఏమయ్యాడు? అని పెద్ద ఎత్తున చర్చ సాగింది.
ఆ వేడుకలకు హాజరు కావాలని కమిటీ చైర్మన్ డీటీ జనార్దన్ స్వయంగా తారక్ కి ఆహ్వాన పత్రిక అందజేసారు. అయితే ఆ ఆహ్వానాన్ని తారక్ సున్నితంగా తిరస్కరించారు. అప్పటికే తారక్ ప్లానింగ్ మరోలా ఉంది. తన కుటుంబంతో కలిసి విదేశీ టూర్ ప్లాన్ చేసుకున్నారు. దీంతో టైగర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. తాత జయంతి వేడుకలు కన్నా? ఫ్యామిలీ ట్రిప్ ముఖ్యమా? అని విమర్శించారు.
కానీ ఆ సమయంలో అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అన్నది అతికొద్ది మందికే తెలుసు. సరిగ్గా 20వ తారీఖున శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని ముందుగా చెప్పి ఉంటే టూర్ క్యాన్సిల్ చేసుకునేవాడు. ఆ టూర్ కి మొత్తం 22 కుటుంబాలు వెళ్తున్నాయి. అప్పటికప్పుడు తారక్ టూర్ క్యాన్సిల్ చేస్తే అంతా డిస్టబ్ అవుతుంది. అందుకే తారక్ ఆ రోజు ఘాట్ వద్దకు వెళ్లలేకపోయారు. అలాగని తాత మీద ప్రేమాభిమానాలు తగ్గవు గా..అంతకు రెట్టింపు ప్రేమని చూపించారు.
20వ తేదిన మాల్దీవులు వెళ్లారు. అక్కడ నాలుగు రోజులు గడిపిన అనంతరం హైదరాబాద్ వచ్చి తాతయ్య ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఆ వెంటనే మళ్లీ తన ఫారిన్ ట్రిప్ ని యధావిధిగా కొనసాగించేందుకు ఆ సాయంత్రమే తిరుగు ప్రయాణం అయినట్లు తెలుస్తుంది. కేవలం తాతయ్యకి నివాళులు అర్పించడానికే మాల్దీవుల నుంచి ప్రత్యేకంగా బయల్దేరి వచ్చారు. అదే నివాళి టూర్ ముగిసన తర్వాతైనా? అర్పించొచ్చు. కానీ తారక్ ఆఛాన్స్ తీసుకోలేదు.
అటు కుటుంబ సభ్యుల్ని బాధపెట్టలేక..ఇటు తాత కార్యక్రమానికి హాజరుకాలేక తానెంత సతమతమ య్యాడో? అతనికే తెలుసు. వ్యక్తిగతంగా తారక్ ఎంతో ఎమోషనల్ పర్సన్ అని కళ్యాణ్ రామ్ ఎప్పటిక ప్పుడు చెబుతూనే ఉంటారు. అలాంటి తారక్ ని విమర్శించడం ఎంతవరకూ న్యాయమో! వాళ్లకే తెలియాలి.
ఆ సంగతి పక్కనబెడితే తారక్ కొత్త ఫోటో ఒకటిప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. 'దేవర' కోసం జిమ్ములో గట్టిగానే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిగో ఇక్కడిలా బ్లాక్ అండ్ బ్లాక్ లో జిమ్ములో ట్రైనర్ సమక్షంలో కసరత్తులు చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బిగువైన మజిల్స్... ఊపిరి బిగపట్టినముఖ అవతారంలో స్పష్టమైన మార్పులు గమనించవచ్చు.