Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: ఆవిడకు టీవీ నటుడంటే అంత లోకువా!
By: Tupaki Desk | 21 Sept 2020 9:15 AM ISTబాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ ఇటీవల దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి అతడు చేయాల్సిన ఒక ప్రాజెక్టు గురించి ముచ్చటిస్తూ ఆసక్తికర సంగతులెన్నో చెప్పారు. రెండుసార్లు అతడు ‘దెయ్యం లాంటోడు!’ అంటూ అనురాగ్ ట్వీట్ చేశారు. మొదటిసారి 2014 లో విడుదలైన `హసీ తో ఫేసీ` టైమ్ లో తెరవెనుక జరిగిన ఓ విషయాన్ని అనురాగ్ పంచుకున్నారు.
`హసీ తోహ్ ఫాసీ` కోసం సుశాంత్ ని ఎంపిక చేయాలనుకున్నాం. కానీ అతడు..అగ్ర బ్యానర్ యష్ రాజ్ ఫిలింస్ తో మూడు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ బ్యానర్ లో అతని మొదటి చిత్రం పరిణీతి చోప్రా కలిసి నటించిన శుద్ధ దేశీ రొమాన్స్. అయితే పరిణీతి ఇదివరకూ సుశాంత్ తో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదని అనురాగ్ తాజాగా రివీల్ చేశాడు.
జర్నలిస్ట్ ఫయే డిసౌజాతో అనురాగ్ మాట్లాడుతూ, “అతను ఈ చిత్రం (హసీ తో ఫాసీ) చేయవలసి ఉంది. మేము ఒక హీరోయిన్ ని అనుకున్నాం. పరిణీతి చోప్రాని అనుకుంటే ‘నాకు టెలివిజన్ నటుడితో కలిసి పనిచేయడం ఇష్టం లేదు’ అని అన్నారు. దాంతో సుశాంత్ సింగ్ ఎవరు? అన్నది వివరణ ఇచ్చాం. అతను కై పో చే చేస్తున్నాడు. అమీర్ తో పీకే చేస్తున్నాడు అని తెలిపాం. హసీ తో ఫాసీ బయటకు వచ్చే సమయానికి అతను కేవలం టెలివిజన్ (టీవీ) నటుడు మాత్రమే కాదని మేము ఆమెకు వివరించాం. ఆ తర్వాతే యష్ రాజ్ సంస్థ అతడిని సంప్రదించి ఒప్పించింది`` అని తెలిపాడు.
అప్పటికే తాను ఓ ప్రాజెక్టు విషయమై సుశాంత్ తో చర్చిస్తే .. అదృశ్యమయ్యాడని... YRF తో ముందుకు వెళ్లడం సుశాంత్ కు మంచి ఒప్పందమని అందరూ అర్థం చేసుకున్నామని తెలిపారు. ఎదగాలనే ఎవరూ అతన్ని వ్యతిరేకించలేదని అనురాగ్ అన్నారు. సుశాంత్ పరిణీతితో శుద్ధ్ దేశీ రొమాన్స్ లో పనిచేయగా.. సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి హసీ తో ఫేసీలో పనిచేశారు.
“సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు ఆరు బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి. అతనికి మరో నాలుగు సినిమాలున్నాయి. ఆ సమయంలో చాలా మందికి అతను ఏమి చేస్తున్నాడో తెలియదు. ఇప్పుడే అతను డిప్రెషన్ తో వ్యవహరిస్తున్నట్లు బయటకు వచ్చింది. కానీ ఆ సమయంలో పరిశ్రమకు అతనితో ఉన్న సమస్య ఏమిటంటే అతను అందరినీ దెయ్యాల్ని చేస్తున్నాడు. అతను తప్పుగా ప్రవర్తించడం సమస్య కాదు. అతన్ని కలిసే వ్యక్తులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గొప్ప కుర్రాడు. చాలా బాగా ప్రవర్తిస్తాడు... సున్నితమైనవాడు.. మంచివాడు!! అని చెబుతారు. కానీ అతనో దెయ్యం .. జెట్ ..అదృశ్యమైపోతాడు” అని తెలిపాడు. ఇక్కడ దెయ్యం అంటే అతడు ఎవరికీ చిక్కడు దొరకడు అని అర్థం.
సుశాంత్ తనలోని ఈ తప్పిదాన్ని గుర్తించి మారడానికి ప్రయత్నిస్తున్నాడని తనకు తెలుసు అని అనురాగ్ తెలిపారు. అతను తన ఏజెన్సీలను మార్చాడు. YRF నుండి కార్నర్ అయ్యాడు. నటుడి మరణానికి మూడు వారాల ముందు సుశాంత్ వద్ద పని చేసే కొత్త మేనేజర్ తన వద్దకు వచ్చాడని అనురాగ్ చెప్పాడు. సుశాంత్ మేనేజర్ నాతో ఓసారి ‘అనురాగ్ కాల్ చేస్తే.. అతను మీ కాల్‌కు సమాధానం ఇవ్వడు’ అని చెప్పాడు. తన సినిమా కాదని అదృశ్యమైనందుకు సుశాంత్ కూడా అపరాధభావంతో ఉన్నాడు అని అనురాగ్ అభిప్రాయపడ్డాడు.