Begin typing your search above and press return to search.

కబాలి డైరెక్టర్.. కన్ఫమ్ చేశాడు

By:  Tupaki Desk   |   27 Jun 2016 9:26 AM GMT
కబాలి డైరెక్టర్.. కన్ఫమ్ చేశాడు
X
ఓ చిన్న సినిమా.. ఇంకో మీడియం రేంజి మూవీ.. మొత్తంగా రెండే రెండు సినిమాల అనుభవంతో సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు పా రంజిత్. ఐతే ఆ అవకాశాన్ని అతను బాగానే సద్వినియోగం చేసుకున్నాడని ‘కబాలి’ టీజర్ చూడగానే అందరికీ అర్థమైపోయింది. మరి రజినీ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేశాక.. ఆ తర్వాత రంజిత్ ఛాయిస్ ఏంటి? ఏ హీరోతో సినిమా చేస్తాడు.. అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. సూర్యతో పాటు ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు వినిపించాయి. ఐతే స్వయంగా రంజితే తన తర్వాతి సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ‘‘కబాలి సినిమాతో నేనేంటో తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుస్తుంది. నా తర్వాతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్యతో చేయబోతున్నా. ఇది ద్విభాషా చిత్రం’’ అని రంజిత్ తెలిపాడు.

‘కబాలి’ మీద ఉన్న హైప్.. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి చెబుతూ.. ‘‘తమిళ.. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. దేశ విదేశాల్లో ఎక్కడికెళ్లినా జనాలు కబాలి గురించి మాట్లాడటం చాలా సంతోషాన్నిస్తోంది. నా సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందని నేనూ అనుకోలేదు. తెలుగు ప్రేక్షకులు కూడా ‘కబాలి’ విషయంలో చూపిస్తోన్న ప్రేమను మర్చిపోలేను. రేపు సినిమా విడుదలయ్యాక అందరినీ సంతృప్తి పరుస్తామన్న నమ్మకం ఉంది. మలేషియా నేపథ్యంలో ఒక గ్యాంగ్‌ స్టర్ జీవితం చుట్టూ తిరిగే కథే ఈ కబాలి. అంతకుమించి ఈ కథ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. సినిమా చాలా బాగా వచ్చింది. రజనీకాంత్ ఔట్‌ పుట్ చూసి మెచ్చుకున్నారు. ‘కబాలి’ రిలీజ్ డేట్ రెండుమూడుసార్లు మారింది. దీంతో జనాల్లో గందరగోళం నెలకొంది. అందుకే ఈసారి జాగ్రత్తపడుతున్నాం. కొన్ని చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. సెన్సార్ కూడా అవ్వాలి. అదయ్యాకే విడుదల తేదీ పక్కాగా చెబుదామని వెయిట్ చేస్తున్నాం. ఇంకో వారం రోజుల్లోపే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని రంజిత్ చెప్పాడు.