Begin typing your search above and press return to search.

మరోసారి కన్ఫర్మ్‌ చేసిన సర్కారు వారి పాట డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   7 May 2022 12:00 PM IST
మరోసారి కన్ఫర్మ్‌ చేసిన సర్కారు వారి పాట డైరెక్టర్‌
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా ఈనెల 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు పరశురామ్‌ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించిన పరశురామ్‌ తదుపరి సినిమా ఏమై ఉంటుంది అంటూ చాలా మంది సినీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమాకు ముందుగానే పరశురామ్‌ సినిమా నాగ చైతన్య తో కన్ఫర్మ్‌ అయ్యింది. నాగ చైతన్య కు కథ చెప్పడం.. అధికారిక ప్రకటన రావడం కూడా జరిగింది. కాని మహేష్‌ బాబు తో ఆఫర్‌ రావడంతో చైతూ సినిమా వాయిదా వేసుకుని సర్కారు వారి పాట సినిమాను దర్శకుడు పరశురామ్‌ చేయడం జరిగింది. మహేష్ బాబు తో సినిమాను ముగించిన పరశురామ్ తదుపరి సినిమా గా నాగచైతన్య తో చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఈమద్య కాలంలో పెద్ద హీరోలతో సినిమాలు చేసిన దర్శకులు ఒక్కో సినిమాకు ఏడాది రెండేళ్ల సమయం తీసుకుంటున్నారు. పరశురామ్‌ కూడా సర్కారు వారి పాట సినిమా తర్వాత గ్యాప్ తీసుకుంటాడేమో అనుకున్నారు. కాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు పరశురామ్‌ తాను వెంటనే నాగ చైతన్య తో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు.

నాగ చైతన్య తో ఇప్పటికే స్క్రిప్ట్‌ విషయమై చర్చలు జరిగాయి.. 14 రీల్స్ బ్యానర్‌ వారు సినిమాను నిర్మించేందుకు సిద్దంగా ఉన్నారు. కనుక ప్రస్తుతం చైతూ చేస్తు ఉన్న ప్రాజెక్ట్‌ లు పూర్తి అయిన తర్వాత పరశురామ్ తో సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా మంచి కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్ గా ఉండబోతుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

పరశురామ్‌ సర్కారు వారి పాట సినిమా తో సక్సెస్ దక్కించుకుంటే కచ్చితంగా ఆయన రేంజ్ మరింతగా పెరగడం ఖాయం. అప్పుడు స్టార్‌ హీరోలు.. సీనియర్ స్టార్స్ ఆయనతో సినిమాను చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా ఇప్పటికే చైతూ తో సినిమాను చేసేందుకు రెడీగా ఉన్నట్లుగా ప్రకటించాడు. ఇంతకు ముందే పరశురామ్‌ తన తదుపరి సినిమా ను చైతూ తో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని కన్ఫర్మ్‌ చేశాడు.