Begin typing your search above and press return to search.

జనతా సక్సెస్.. ఎన్టీఆర్ కంటతడి

By:  Tupaki Desk   |   13 Sept 2016 10:50 PM IST
జనతా సక్సెస్.. ఎన్టీఆర్ కంటతడి
X
''ఏడుపు అపుకుంటున్నాను. ఆనందంతో వచ్చే ఏడుపే. కాని ఆపుకుంటున్నాను'' అంటూ ప్రసంగించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మంగళవారం సాయంత్రం జరిగిన జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్లో కన్నీంటి పర్యంతమవుతూ ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ అందరినీ కదిలించింది.

''13 ఏళ్లు అయ్యింది. ఒక వెలుగు కనిపిస్తోందని చెప్పాను ఆడియో ఫంక్షన్లో.. అదే నిజమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజైనప్పుడు.. రకరకాల రిపోర్టులు వచ్చినప్పుడు.. అసలు ఆ ఫీడ్ బ్యాక్ వింటుంటే.. మీలో ఈ ఆనందాన్ని చూడ్డానికి ఇన్నేళ్ళుపట్టిందా అంటూ నేనే ఆనందపడ్డాను. జనతా గ్యారేజ్ ద్వారా అమ్మానాన్నలకు - అభిమానులకు - అందరికీ అద్భుతమైన ఆనందాన్ని పంచాను'' అంటూ చెప్పాడు ఎన్టీఆర్. ''విజయాలు దక్కుతున్నాయి. విజయాలు వస్తున్నాయి. కాని ఇలాంటి విజయం కోసం ఎన్నేళ్ళు ఆగానో మీ అందరికీ తెలుసు. అభిమానుల ముందు తలెత్తుకు తిరిగే విజయాన్ని అందించిన కొరటాల శివకు ఆజన్మాంతం ఋణ పడిపోయి ఉంటాను'' అంటూ మరింత ఎమోషనల్ అయిపోయాడు.

ఇది జనతా విజయం అని చెబుతూ.. సినిమా పేరును జనతా గ్యారేజ్ అని పెట్టినందుకే ఇలా జరిగిందంటూ.. ఫ్యూచర్ లో ఇలాంటి సినిమాలే చేస్తాను అని సెలవిచ్చాడు. ''జనతా గ్యారేజ్ విజయం ఒక ఊపునిచ్చింది. ఒక ఆనందాన్ని ఇచ్చింది. బ్రతికినంత కాలం ఇలానే అలరిస్తాను. మీ ఆప్యాయం పొందుతాను'' అని సెలవు తీసుకున్నాడు యంగ్ టైగర్.