Begin typing your search above and press return to search.
బాడీ షేమింగ్ గురించి భలే చెప్పిందిగా!
By: Tupaki Desk | 10 Aug 2019 7:00 AM ISTబాడీ షేమింగ్ అంటే తెలుసు కదా? లావుగా ఉన్నారనో.. పొట్టిగా ఉన్నారనో.. పొట్టతో ఉన్నారనో.. నలుపుగా ఉన్నారనో కామెంట్లు చేయడం.. ట్రోలింగ్ చేయడం. ఈ ఇబ్బంది సాధారణ జనాలకంటే సెలబ్రిటీలకు ఎక్కువగా ఉంటుంది. జనాలు ఆశించేదానికంటే కాస్త భిన్నంగా ఉంటే చాలు ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా ఈ అంశంపై టాలెంటెడ్ బ్యూటీ నిత్యా మీనన్ స్పందించింది.
బాలీవుడ్ చిత్రం 'మిషన్ మంగళ్' లో నిత్య ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంది. బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ "జనాలు డిఫరెంట్ గా ఉండేవారిని కూడా గుర్తించడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అందరూ ఒకేరకంగా ఉండలేరు. ముక్కు సరిగా లేదని ఫిక్స్ చేసుకోమంటే ఎలా?" అంటూ ప్రశ్నించింది. అది నెగెటివిటీ అని తేల్చేసింది. పిల్లలకు చిన్నవయసు నుండే మనం ఈ బాడీ షేమింగ్ జబ్బు అంటుకోకుండా చూడాలని కోరింది. ఎవరైనా పిల్లలు లావుగా ఉన్నారని ఏడిపిస్తూ ఉంటే వారిని వెంటనే ఆపాలని చెప్పింది. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ దారుణంగా ఉంటుందని.. యాక్టర్స్ ఇలా ఉండాలని.. అలా ఉండాలని ఎంతో ఆశిస్తారని.. అలా లేకపోతే ట్రోలింగ్ కు దారి తీస్తుందని చెప్పింది. ఒక వ్యక్తి లావుగా ఉన్నాడంటే అతను సోమరి అని ఎక్సర్ సైజ్ చెయ్యడని మాత్రమే అర్థం కాదని.. హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా అలా ఉంటారని.. ప్రతి ఒక్కరిని అలా ట్రోలింగ్ చేయడం సరికాదని చెప్పింది.
'మిషన్ మంగళ్' లో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం అని చెప్పుకొచ్చింది. 'మిషన్ మంగళ్' టీమ్ మెంబర్స్ తో షూటింగ్ సరదాగా సాగిందని.. అక్షయ్ సర్ ఏదో ఒక రకంగా తనను ఏడిపించే వారని.. జోకులు వేసుకునేవాళ్ళమని.. కబుర్లు చెప్పుకునేవారిమని.. కలిసి భోజనం చేసేవాళ్ళమని తెలిపింది. విద్యా బాలన్ తో ఇదివరకూ ఎన్టీఆర్ బయోపిక్ లో కలిసి పని చేశానని.. తాప్సీతో పని చేయడం ఇది మొదటిసారి అని తెలిపింది. ఇండియా ప్రయోగించిన మార్స్ ఆర్బిటార్ మిషన్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి జగన్ శక్తి దర్శకుడు. ఆగష్టు 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.