Begin typing your search above and press return to search.

బికినీ బీచ్ లో చెల‌రేగుతున్న హాట్ శ‌ర్మా గాళ్

By:  Tupaki Desk   |   6 March 2021 2:30 AM GMT
బికినీ బీచ్ లో చెల‌రేగుతున్న హాట్ శ‌ర్మా గాళ్
X
ఇటీవ‌లి కాలంలో మోడ‌ల్ కం న‌టి నిఖిత శ‌ర్మ సోష‌ల్ మీడియాల్లో ఎంత‌గా పాపుల‌ర‌య్యారో తెలిసిందే. బ్రెయిన్ విత్ బ్యూటీగా ఈ అమ్మ‌డు యువ‌త‌రానికి ఫుల్ ‌గా క‌నెక్ట‌యిపోయింది. ఇక నిరంత‌రం ఏదో ఒక కొత్త ఫోటోషూట్ తో నిఖిత అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.

తాజాగా బికినీ బీచ్ లో చిలౌట్ చేస్తున్న ఓ హాట్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. ఆరెంజ్ అండ్ బ్లాక్ క‌ల‌ర్ టూపీస్ లో నిఖిత అంద‌చందాలు యూత్ కి క‌నువిందు చేస్తున్నాయి. నిజానికి ఏడాది కాలంగా ఈ భామ స్లిమ్ లుక్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. అయితే బొద్దుత‌నం త‌గ్గించుకునేందుకు అంత‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం లేద‌ని మొన్న‌నే క్లాస్ తీసుకునేంత‌గా విసిగిపోయానంది.

ప్ర‌స్తుతం సౌత్ సినీప‌రిశ్ర‌మ‌ల్లో అవ‌కాశాల కోసం ట్రై చేస్తున్న ఈ బ్యూటీ ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ బాగానే ఆర్జిస్తోంది. ఇన్ స్టా మాధ్య‌మంగానూ బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేస్తూ అసాధార‌ణంగా సంపాద‌న పెంచుకుంటోంది. ఇక టాలీవుడ్ లోనూ న‌టించేందుకు ఈ అమ్మ‌డు ఎంతో ఆస‌క్తిగా ఉందిట‌. ఆ ఒక్క ఛాన్స్ ఎప్ప‌టికి ద‌క్క‌నుందో చూడాలి.