Begin typing your search above and press return to search.

క‌రోనాలా క‌వ్వించ‌కు లేజీ శ‌ర్మా గాళ్‌

By:  Tupaki Desk   |   23 March 2020 4:30 PM GMT
క‌రోనాలా క‌వ్వించ‌కు లేజీ శ‌ర్మా గాళ్‌
X
క‌రోనాలా రార‌మ్మ‌ని క‌వ్విస్తోంది. ఎవ‌రీ కొంటె కుమారి? అంటే కాస్త వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ఈ అమ్మ‌డి పేరు నిఖిత శర్మ. టాప్ మోడ‌ల్.. అంత‌కుమించి మోటివేషనల్ స్పీకర్ గా పేరుంది. ఇంత‌కుముందు యంగ్ ఉమన్ అచీవర్స్ అవార్డు 2016.. ఎక్స్‌సెప్షనల్ వుమన్ ఆఫ్ ఎక్సెలెన్స్ 2019 అవార్డుల‌ను గెలుచుకుంది. మ‌రోవైపు ఉన్న‌త విద్యావంతురాలు కాబ‌ట్టి మైక్రో బయాలజిస్టుగా పనిచేస్తోంది.

శర్మ ట్యాలెంట్ గురించి మ‌రింత డీటెయిల్స్ లోకి వెళితే.. మిస్ ఎయిర్ హోస్టెస్ అకాడమీ టైటిల్ గెలుచుకుంది. ఇండియన్ ప్రిన్సెస్ అందాల పోటీలో పాల్గొంది. కోకాకోలా- ఇన్వర్టిస్ విశ్వవిద్యాలయం- జియోవాని- టివిఎస్ స్కూటీ - లేస్ వంటి బ్రాండ్ల కోసం వ వాణిజ్య ప్రకటనలలో కనిపించింది. షాజీత్ బాల్ `తేరి యాడ్` అనే మ్యూజిక్ ఆల్బ‌మ్ లో శర్మ కనిపించింది. టీవీ కెరీర్ ను ఛానల్ Vలో V ది సీరియల్ తో ప్రారంభించింది. దీనిలో ఆమె కరణ్ కుంద్రా సరసన నటించింది. వెంటనే.. లైఫ్ ఓకె యొక్క దో దిల్ ఏక్ జాన్ లో తన మొదటి ప్రధాన పాత్రను పోషించింది. అయాజ్ అహ్మద్ పోషించిన ముంబై గ్యాంగ్ స్టర్ రఘుతో ప్రేమలో పడే అంటారా అనే కాశ్మీరీ అమ్మాయి పాత్రలో ఆమె నటించింది.

అందానికి అందం ట్యాలెంటు ఉన్న ఈ అమ్మ‌డు అటు మోడ‌లింగ్ లోనూ రాణిస్తోంది. ప‌నిలో ప‌నిగా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర ఫోటోషూట్ల‌తో దుమారం రేపడం హ్యాబిట్ గా పెట్టుకుంది. ఇదివ‌ర‌కూ మాల్దీవుల్లో బికినీ సెల‌బ్రేష‌న్స్ తో హీటెక్కించింది. క్లీవేజ్ షోలతో వెర్రెత్తించే ఫోటోషూట్ల‌తోనూ చెల‌రేగింది. తాజా ఫోటోషూట్ లో నాభి అందాల్ని ఎలివేట్ చేస్తూ ఇదిగో ఇలా లేజీగా ఫోజులిచ్చింది. శ‌ర్మాగాళ్ చాకిరేవులే! అంటూ బోయ్స్ కొంటెగా కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.