Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ రాత్రి భీమ్లా డీజే మిక్స్ తో బాక్స్ లు బద్దలు

By:  Tupaki Desk   |   29 Dec 2021 7:34 AM GMT
న్యూ ఇయర్ రాత్రి భీమ్లా డీజే మిక్స్ తో బాక్స్ లు బద్దలు
X
పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వం లో రూపొందిన భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని అభిమానులు అంతా ఆశించారు. నిర్మాత కూడా భీమ్లా నాయక్ ను ఎంత పోటీ ఉన్నా కూడా ఖచ్చితంగా సంక్రాంతికే విడుదల చేస్తామనే పలు సందర్బాల్లో ప్రకటించారు. కాని భీమ్లా నాయక్ ను రాధే శ్యామ్‌ మరియు ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా ల కోసం విడుదల వాయిదా వేసేందుకు పవన్‌ ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల తేడాతో భీమ్లా నాయక్‌ ఆ తర్వాత నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన భీమ్లా నాయక్ నుండి ఇప్పటికే వచ్చిన పాటలు సినిమా స్థాయిని పెంచేశాయి. ఈమద్య కాలంలో బాక్స్‌ లు బద్దలు చేస్తున్న థమన్ ఈ సినిమా కు సంగీతాన్ని అందించిన విషయం తెల్సిందే.

పవన్‌ కళ్యాణ్ బ్రాండ్‌ ఇమేజ్ కు తగ్గట్లుగా థమన్ భీమ్లా నాయక్ కు వాయించాడు. ప్రతి పాట కూడా యూట్యూబ్‌ లో ట్రెండ్‌ అవుతోంది. ముఖ్యంగా భీమ్లా నాయక్‌ లాలా భీమ్లా నాయక్ పాట ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో చెప్పనక్కర్లేదు. ఆ పాట ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వినిపిస్తూ కనిపిస్తూ వస్తోంది. ఆ పాట మరో వర్షన్ ను థమన్‌ విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈమద్య కాలంలో అన్ని పాటలకు డీజే వర్షన్ లు వస్తున్నాయి. అయితే కొన్ని పాటల డీజే వర్షన్‌ లు అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి ఒక విజయాన్ని లాలా భీమ్లా పాట డీజే వర్షన్ రాబోతుంది.

సాదారణంగానే ఆ పాట వీర మాస్.. ఊర మాస్ అన్నట్లుగా ఉంది. ఇక డీజే వర్షన్ లో ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భీమ్లా నాయక్‌ సినిమా లో డీజే మిక్స్ పాట ఉండక పోవచ్చు. కాని డిసెంబర్‌ 31వ తారీకు రాత్రి 7 గంటల సమయంలో విడుదల కాబోతున్న ఈ పాట ఆ రోజు రాత్రి పార్టీ ల్లో.. పబ్‌ ల్లో బాక్స్ లు బద్దలు చేయడం ఖాయం అంటూ అభిమానులు ధీమాగా ఉన్నారు.

కొత్త సంవత్సరంకు భీమ్లా నాయక్ డీజే మిక్స్ పాటతో వెల్‌ కమ్‌ చెప్పేందుకు గాను అభిమానులు సిద్దంగా ఉన్నారు. థమన్‌ డీజే మిక్స్ సాంగ్ ఖచ్చితంగా సినిమా స్థాయిని మరింతగా పెంచే అవకాశం ఉందంటూ నెటిజన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా లో పవన్ తో పాటు రానా కూడా నటించాడు. ఇక పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించింది. పవన్ పోలీస్ గా కనిపించబోతున్నాడు.. నిత్యా మీనన్ ను మాజీ నక్సల్‌ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.