Begin typing your search above and press return to search.

విశ్వ‌క్ తో రాధికా మేడ‌మ్!

By:  Tupaki Desk   |   3 April 2023 11:04 AM GMT
విశ్వ‌క్ తో రాధికా మేడ‌మ్!
X
యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ ఇటీవ‌లే ధ‌మ్కీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. 'దాస్ కా ద‌మ్కీ' అంటూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన హీరో మ‌రో స‌క్సెస్ ని ఖాతా లో వేసుకున్నాడు. మ‌రోసారి యూత్ ఫుల్ కంటెంట్ తో కుర్రాళ్ల‌కి మ‌రింత రీచ్ అయ్యాడు. ఇప్పుడా స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. రెట్టించిన ఉత్సాహంలో కొత్త సినిమా ప‌నుల్లోనూ పాల్గొంటున్నాడు. కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌క్ హీరోగా ఓ సినిమా లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా యూనిట్ హీరోయిన్ల ఎంపిక‌న ప్రిక్రియ‌ను పూర్తిచేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో విశ్వ‌క్ తో ఇద్ద‌రు హీరోయిన్లు రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఒక హీరోయిన్ గా తెలుగు న‌టి అంజ‌లినీ..మ‌రో నాయిక‌గా నేహాశెట్టిని ఎంపిక చేసిన‌ట్లు టాక్ వినిపిస్తుంది. సినిమాలో రెండు పాత్ర‌లు కీరోల్ పోషిస్తాయ‌ని తెలుస్తుంది. అయితే వీళ్ల‌లో మెయిన్ లీడ్ ఎవ‌రంటే? నేహాశెట్టి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. అంజ‌లిని ఓ కీల‌క పాత్ర‌కి ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.

కీల‌క పాత్ర అయినా తెర‌పై క‌నిపించినంత సేపు ఆ పాత్ర ఆస‌క్తిక‌రంగానే సాగుతుంద‌ని తెలుస్తుంది. అయితే ఈ పాత్ర‌కి అంజ‌లిని ఎంపిక చేయ‌డం వెనుక మ‌రో కార‌ణం కూడా వినిపిస్తుంది. ఈ చిత్ర క‌థ రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్య‌లో జ‌రిగే చీక‌టి సామ్రాజ్యం గురించి చెబ‌తుంది .

ఇందులో విశ్వ‌క్ గ్రేషేడ్ రోల్ పోషిస్తున్నాడు. విశ్వ‌క్ రోల్ ని మ్యాచ్ చేయాలన్నా? రాజ‌మండ్రి యాస‌కి క‌నెక్ట్ అవ్వాల‌న్నా? అంజ‌లితోనే సాధ్య‌మ‌ని భావించి ఆమెని తీసుకున్న‌ట్లు తెలుస్తుంది.

మ‌రి ఇందులో వాస్త‌వం తెలియాల్సి ఉంది. గ‌తంలో 'సీత‌మ్మ వాకిట్ల సిరిమ‌ల్లె చెట్టు 'సినిమాలో అంజ‌లి గోదారి యాస‌లో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ బ్యూటీకి తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. ఆ సినిమా త‌ర్వాత కొన్ని చిత్రాల్లో న‌టించినా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఈ నేప‌థ్యంలో విశ్వ‌క్ సేన్ తో అవ‌కాశం నిజ‌మే అయితే? ల‌క్కీ ఛాన్స్ గానే చెప్పాలి. అయితే కోలీవుడ్ లో మాత్రం బిజీగానే కొన‌సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.