Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : ఏంటి రాధిక అందాలతో చంపేస్తావా ఏందీ?

By:  Tupaki Desk   |   3 Aug 2022 1:30 PM GMT
ఫోటోటాక్ : ఏంటి రాధిక అందాలతో చంపేస్తావా ఏందీ?
X
డీజే టిల్లు సినిమా తో సిద్దు జొన్నలగడ్డ కు ఎంతటి పేరు వచ్చిందో.. అంతే పేరు హీరోయిన్‌ నేహా శెట్టికి వచ్చింది అనడంలో సందేహం లేదు. సిద్దుకు సమానమైన పాత్ర స్క్రీన్‌ స్పేస్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు ఆ సినిమా లో అందాలతో అదరగొట్టేసింది. సినిమాలో ఎక్కువ శాతం చీర కట్టులో ఉన్నా కూడా అందం అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా అందరినీ ఆకట్టుకుంది.

ముఖ్యంగా సినిమాలో హీరో రాధిక అంటూ పిలిచే పిలుపుకు అంతా ఫిదా అయ్యారు. అప్పటి నుంచి కూడా ప్రేక్షకులు నేహా శెట్టి కి బదులుగా రాధిక అనే ఎక్కువగా సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఏంటి రాధిక ఈ అందాల ఆరబోత.. యువతను చంపేస్తావా ఏంది.. కాస్త గ్యాప్ ఇచ్చి ఒకొక్క ఫోటోను షేర్‌ చేయరాదు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

డీజే టిల్లు తర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అవుతుందని అంతా భావించారు. కాని ఈ అమ్మడు మాత్రం ఆచితూచి సినిమాల ను ఎంపిక చేసుకుంటుంది. ఈ సమయంలో కాస్త అటు ఇటు అయినా కూడా కెరీర్ లో చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే నేహా కాస్త మెల్లగా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

హీరోయిన్ గా వరుస సినిమాలు చేయడం కంటే మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు ఉంది. అందుకే వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను ఓకే చెప్పడం లేదు. హీరోయిన్ గా డీజే టిల్లు 2 లో కూడా ఈమె ఉంటుందా అంటే ప్రస్తుతానికి సమాధానం లేదు. త్వరలోనే ఈ విషయమై యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.