Begin typing your search above and press return to search.

డీజే టిల్లు బ్యూటీకి మరో లక్కీ ఛాన్స్

By:  Tupaki Desk   |   16 Jun 2022 1:30 AM GMT
డీజే టిల్లు బ్యూటీకి మరో లక్కీ ఛాన్స్
X
రాజావారు రాణి గారు అనే సినిమాతో ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే మరొక సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు.

మొత్తానికి అతని సినిమాలు చూడవచ్చు అనే విధంగా ఓ వర్గం ప్రేక్షకులు కూడా మొదటి రోజే థియేటర్ కు వస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూస్తుంటే భవిష్యత్తులో మీడియమ్ రేంజ్ హీరోల లిస్టులోకి చాలా తొందరగానే ఎదిగేలా ఉన్నాడు అని అనిపిస్తుంది.

ఇతను ప్రతి సినిమా కథ విషయంలో కూడా చాలా కొత్తగా ఆలోచించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సమ్మతమే అనే సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత కిరణ్ నుంచి రూల్స్ రంజన్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఖుషి నిర్మాత ఏం రత్నం నిర్మించబోతున్నారు.

ఇక ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేశారు. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో అనే విషయంలో ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇక మొత్తానికి ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఆ విషయంలో అఫిషియల్ గా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల డీజే టిల్లు సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా నేహా శెట్టి ముఖ్యమైన కథానాయిక పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా వివరణ ఇచ్చారు.

ఇక వీలైనంత త్వరగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టే రెండు మూడు నెలల్లోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమాను నవంబర్ ఈ ఏడాది నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం మరికొన్ని కొత్త ప్రాజెక్టులపై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నాడు. మరి ఈ సినిమాలతో ఈ యువ కథానాయకుడు తన మార్కెట్ ను ఇంకా ఏ స్థాయిలో పెంచుకుంటాడో చూడాలి.