Begin typing your search above and press return to search.

త్వరలోనే పిల్లలను తీసుకొస్తా -నమ్రతా

By:  Tupaki Desk   |   17 March 2016 5:28 PM IST
త్వరలోనే పిల్లలను తీసుకొస్తా -నమ్రతా
X
బుర్రిపాలెం గ్రామాన్ని విజిట్‌ చేసిన నమ్రతా శిరోద్కర్‌.. ఈ గ్రామాన్ని చూసి ఎంతో మురిసిపోతున్నా అంటోంది. ఈరోజు గ్రామస్తులతో మాట్లాడి . అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్‌ తో మాట్లాడిన నమ్రత.. త్వరోలనే ఇక్కడకు తన పిల్లలను తీసుకొస్తా అంటోంది.

''ఇప్పటివరకు పిల్లలను ఇక్కడకు తీసుకురాలేదు. చాలా మిస్సయ్యాను అనిపిస్తోంది. సో.. త్వరలోనే వాళ్ళను తీసుకొస్తా. ఇక్కడ మాకు ఫ్యామిలీ కూడా ఉంది. వాళ్ళని కూడా కలవాలి కదా'' అని చెప్పింది నమ్రత. అంతే కాకుండా.. ఈ గ్రామంలో ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో చూసుకొని.. వాటి గురించి కూడా ఒక అంచనాకు వచ్చిందట.

''గ్రామంలో ఆరోగ్యం.. పారిశుద్యం మెరుగుపడటానికి చాలా పనులే చేపట్టాలి. ఇప్పటివరకు దాని గురించే అధ్యయనం చేశాం. త్వరలోనే కొన్ని పరిష్కారాలను కల్పించి.. ఆ పనులు ప్రారంభిస్తాం. అయితే ఈ పనులు చేయడానికి శ్రీమంతుడు సినిమా మాత్రం ప్రేరణ కాదు. ఎప్పటినుండో మహేష్‌ గ్రాండ్‌ మథర్‌ ఈ సేవలను చేస్తున్నారు. తరువాత మహేష్‌ తండ్రి కృష్ణగారు గ్రామానికి చాలా చేశారు. ఇప్పుడు మహేష్‌ చేస్తున్నాడు. సో.. సినిమా ద్వారా ప్రేరణ పొందం అనకూడదేమో'' అంటూ ముగించింది నమ్రత.

ఇకపోతే నమ్రత బుర్రిపాలెం విజిట్‌ ఏమో కాని.. ఆమెను చూడ్డానికి అభిమానులు ఎగబడ్డారు. ఆమెకు బొకేలు అందించడానికి అందరూ ఇష్టపడ్డారు. చేయాల్సిన కార్యక్రమానికి విఘాతం కలిగిస్తూ అభిమానులు చేసిన గోల అంతా ఇంతా కాదు.