Begin typing your search above and press return to search.

'ఆకాశం నీ హద్దురా'లో నిజ జీవిత వ్యక్తిత్వాన్ని ప్రతిబింభించే పాత్రలో నటించిన కలెక్షన్ కింగ్..!

By:  Tupaki Desk   |   11 Nov 2020 11:10 AM GMT
ఆకాశం నీ హద్దురాలో నిజ జీవిత వ్యక్తిత్వాన్ని ప్రతిబింభించే పాత్రలో నటించిన కలెక్షన్ కింగ్..!
X
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆకాశం నీ హద్దురా' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించారు. కాగా, మోహన్ బాబు తన నిజ జీవిత వ్యక్తిత్వాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మారుపేరని.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా రూల్స్ బ్రేక్ చేయకుండా ఉంటాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. నిర్భయంగా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే విలక్షణ నటుడి వైఖరి తరచుకుగా టాలీవుడ్ వర్గాలలో చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రియల్ లైఫ్ లో మోహన్ బాబు చూపించే యాటిట్యూడ్ ని ఆన్ స్క్రీన్ 'ఆకాశం నీ హద్దురా' సినిమాలో తన పాత్రలో చూపించారని తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమాలో తాను పోషించిన ఎయిర్ కమాండర్ పాత్ర పేరు 'భక్తవత్సలం నాయుడు' అని తెలుస్తోంది. భక్తవత్సలం నాయుడు అనేది మంచు మోహన్ బాబు రియల్ నేమ్ అనే విషయం తెలిసిందే. 'ఆకాశం నీ హద్దురా' చిత్రంలో ఆయన క్రమశిక్షణ కలిగి ఉండటంతో పాటు స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అయ్యే అధికారి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఇందులో మోహన్ బాబు మరియు సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు విజువల్ ట్రీట్ గా ఉంటాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. డైరెక్టర్ సుధా కొంగర క్రియేట్ చేసిన భక్తవత్సలం నాయుడు పాత్రలో మోహన్ బాబు తన అనుభవంతో అద్భుతంగా నటించాడని తెలుస్తోంది. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించిన 'ఆకాశం నీ హద్దురా' చిత్రాన్ని రేపు(నవంబర్ 12) అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు.