Begin typing your search above and press return to search.
ఈసారి మహేష్ పూనేలో పోయిస్తాడేమో!
By: Tupaki Desk | 30 Jun 2016 4:17 AM GMTసౌతిండియా సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న డైరెక్టర్ మురుగదాస్.. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే టాలీవుడ్, కోలీవుడ్ లతో పాటు సౌతిండియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పక్కాగా పూర్తి కాగా.. ప్రస్తుతం కేరక్టర్ కి తగిటనట్లుగా మేకోవర్ చేస్తున్నాడు మహేష్. ఈ మూవీ ప్రారంభం ఎప్పుడెప్పుడా అని సూపర్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత మంచి ఆకలి మీద ఉన్న మహేష్ బాబు అభిమానులకు.. మురుగదాస్ తో సినిమా మహేష్ అనగానే కొత్త రికార్డులన్నీ తమవే అని ఆశలు పెట్టేసుకున్నారు. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని చెప్పిన మురుగదాస్.. ఈ సినిమాలో ఎక్కువగ భాగం పూనేలో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే.. సినిమా మొదలయ్యేది మాత్రం హైద్రాబాద్ లోనే. జూలై 29న తొలి షూట్ చేయనుండగా.. ఇందుకోసం ఇప్పటికే ఓ భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. తొలి రోజు షూట్ ని కంటిన్యూ చేయడంతో పాటు.. ఐదు రోజుల పాటు వరుసగా ఇదే సెట్ లో షూటింగ్ చేయనున్నారట.
ఈ ఐదు రోజుల్లో ఓ పాటను పిక్చరైజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత మహేష్ అండ్ మురుగదాస్ టీమ్ మొత్తం పూనేకి షిఫ్ట్ అవుతారు. అక్కడ భారీ షెడ్యూల్ ని చేసిన తర్వాత తిరిగి హైద్రాబాద్ రానున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేసేళా టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుండగా.. మొత్తం 6 ప్రొడక్షన్ కంపెనీలు నిర్మాణంలో భాగం కావడం విశేషం. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటించనుండగా.. హారిస్ జైరాజ్ మ్యూజిక్ ఇస్తున్నాడు.