Begin typing your search above and press return to search.

25 ఏళ్ళ రోజాకు చీర్స్!!!

By:  Tupaki Desk   |   12 May 2017 7:34 AM GMT
25 ఏళ్ళ రోజాకు చీర్స్!!!
X
బెదురుచూపులతో.. అమాయకమైన మొహంతో... ముద్దుముద్దు మాటలతో ‘‘చిన్నిచిన్ని ఆశ.. చిన్నదాని ఆశ’’ అంటూ రోజా సినిమాలో మధుబాల నటించిన తీరును నాటితరం వారెవరూ మర్చిపోలేరు. భర్త ప్రాణాల కోసం కాశ్మీర్ టెర్రరిస్టులతోనే పోరాడిన నవ వధువుగా అందరి మనసులు కొల్లగొట్టేసింది. మణిరత్నం సినిమాల్లో మనందరికీ గుర్తుండిపోయే సినిమాల్లో కచ్చితంగా రోజా ముందే ఉంటుంది. మ్యూజిక్ మాంత్రికుడు ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రంతోనే పరిచయమయ్యాడు. ఈ సినిమాలు అన్నిపాటలూ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ముఖ్యంగా చిన్నిచిన్ని ఆశ పాట ఇప్పటికీ కొందరి ఫోన్లలో వినిపిస్తూనే ఉంటుంది. ఆగస్టు 16, జనవరి 26వ తేదీన టీవీల్లో ప్రసారమయ్యే రోజా చూసినవారందరికీ ఆనాటి అనుభూతులు గుర్తుకు రావడం ఖాయం.

ప్రేక్షకులనందరి హృదయాలను గెలుచుకున్న రోజా చిత్రం 1992 మే మే 11న విడుదలైంది. అంటే ఈ సినిమా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుందన్న మాట. తన కెరీర్ ను ఓ మలుపు తిప్పిన ఈ సినిమాను మధుబాల ఇప్పటికీ గుర్తుంచుకుంది. సినిమా విడుదలైన రజత వసంతాలను గుర్తు చేస్తూ ట్విట్టర్ లో ఛీర్స్ చెప్పింది. రోజా తర్వాత మధుబాలకు చాలా హిట్లొచ్చాయి. తెలుగు లోనూ చాలా సినిమాలే చేసింది. వాటిలో అల్లరి ప్రియుడు, జెంటిల్ మెన్ వంటి బ్లాక్ బస్టర్ లు సైతం ఉన్నాయి. అయినా రోజాలో ఆమె చేసిన పల్లెటూరి పిల్ల పాత్రను జనం ఇంకా మర్చిపోలేదంటే ఆ పాత్రను ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.

టెర్రరిస్టులు, ఆర్మీల దాడులు.. ప్రతిదాడులతో అందాల కాశ్మీరం ఎలా తయారవుతోందో... సామాన్యుడు ఎలా నలిగిపోతున్నాడో ‘రోజా’ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపాడు మణిరత్నం. ఇప్పటికీ ఆనాటి పరిస్థితుల్లో మార్పు రాకపోవడం బాధ కలిగించే అంశం. ఆ సంగతెలా ఉన్నా ఎన్నాళ్లు గడిచినా.. ఎన్నేళ్లు గడిచినా రోజా చిత్రం పేరు చెప్పగానే మనందరి కళ్లముందు ఆనాటి అందమైన పల్లెపడుచే కళ్లముందు కదలాడుతుంది. అంతగా గుర్తుండిపోయేలా చేసిన 25 ఏళ్ల రోజాకు ఛీర్స్!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/