Begin typing your search above and press return to search.

రాధిక కి అన్యాయం చేస్తావా టిల్లు!

By:  Tupaki Desk   |   12 July 2022 10:30 AM GMT
రాధిక కి అన్యాయం చేస్తావా టిల్లు!
X
చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'డీజే టిల్లు'. ఈ సినిమా లో సిద్దు జొన్నలగడ్డ నటనకు యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్‌ అయ్యారు. ఆయన రాధిక అంటూ చెప్పే డైలాగ్స్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పెద్ద ఎత్తున టిల్లు మరియు రాధిక పాత్రలకు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయిన విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న షార్ట్‌ వీడియోలను చూస్తే అర్థం అవుతుంది.

రాధిక పాత్రను డీజే టిల్లు సినిమా లో ఒక నెగటివ్‌ రోల్‌ అన్నట్లుగా చూపించినా.. చివరకు కాస్త పాజిటివ్ నోడ్‌ తోనే ఎండ్ చేశారు. కనుక డీజే టిల్లు పార్ట్‌ 2 లో ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేకూరేలా చేస్తారని అంతా అనుకున్నారు. డీజే టిల్లు మరియు రాధికల రొమాన్స్ ను పార్ట్‌ 2 లో చూస్తామని భావించిన ప్రేక్షకులకు నిరాశ తప్పేలా లేదు.

డీజే టిల్లు పార్ట్‌ 2 ఇటీవలే ప్రారంభం అయ్యింది. షూటింగ్‌ అప్పుడే హడావుడిగా జరుగుతుందట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా లో రాధిక పాత్ర ను పెద్దగా ప్రాముఖ్యత లేకుండా స్క్రీన్‌ ప్లే నడిపించబోతున్నారట. మరో హీరోయిన్‌ టిల్లు గాడి లైఫ్ లోకి రావడంతో కథ మరో టర్న్‌ తిరిగేలా కథను డిజైన్ చేసినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

డీజే టిల్లు సినిమా కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో డీజే టిల్లు 2 కోసం కాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అంతే కాకుండా సినిమా కోసం కాస్త ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సినిమా లోని మెజార్టీ పార్ట్‌ ను విదేశాల్లో చిత్రీకరించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.

సినిమా మొదలు అవ్వగానే రాధిక పాత్రను కట్ చేస్తున్నారు.. తగ్గిస్తున్నారు అంటూ వస్తున్న వార్తలు ఒకింత ఆసక్తిని సినిమా పై తగ్గిస్తున్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం రాధిక పోతే మరోకరితో డీజే టిల్లు రొమాన్స్ అదరబోతుంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చాలా నమ్మంగా చెబుతున్నారు.