Begin typing your search above and press return to search.

సమంత-నిత్య పక్కపక్కన ఎందుకు లేరు?

By:  Tupaki Desk   |   20 Sept 2016 1:00 PM IST
సమంత-నిత్య పక్కపక్కన ఎందుకు లేరు?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్.. ఇప్పటికే 80కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ టాప్ 3 స్లాట్ కి చేరిపోయింది. గ్యారేజ్ నెక్ట్స్ టార్గెట్ శ్రీమంతుడును ఓవర్ టేక్ చేయడమే. ఇందుకు ఇంకో 6 కోట్ల షేర్ అవసరం కాగా.. ఇది కొంచెం కష్టమే కావచ్చనే అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో ఓ చిన్నపాటి వివాదం ఉందనే టాక్ వినిపించింది.

జనతా గ్యారేజ్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో సమంత యాక్టివ్ గా పాల్గొంది. ఆ సమయంలో ఇంకో హీరోయిన్ నిత్యా మీనన్ కనిపించలేదు. విడుదల తర్వాత నిత్యామీనన్ ప్రమోషన్స్ లో పాల్గొంటే.. సమంత సైడ్ అయిపోయింది. ఇలా జరగడానికి కారణం ఏంటో.. దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. 'జనతా గ్యారేజ్ రిలీజ్ సమయానికి నిత్య మీనన్ వాళ్ల గ్రాండ్ మదర్ మరణించారు. దీంతో ఆమె ప్రమోషన్స్ కి అటెండ్ కాలేకపోయింది. కానీ రిలీజ్ తర్వాత చాలా యాక్టివ్ గా పాల్గొంది. ఒకవైపు విక్రమ్ సినిమా షూటింగ్ చేస్తూనే.. గ్యారేజ్ ప్రమోషన్స్ కు వచ్చింది' అని చెప్పాడు కొరటాల శివ.

సమంత ప్రమోషన్స్ నుంచి తప్పుకోవడానికి కూడా కొరటాల ఓ కారణం చెప్పాడు. ఆ సమయానికల్లా శామ్ సిటీలో ఉండే పరిస్థితి లేదని.. అందుకే వాళ్లిద్దరూ కలిసి ప్రమోషన్స్ చేయలేకపోయారని చెప్పాడు కొరటాల శివ. చాలా ఈ క్లారిటీ? ఇంకా కావాలా?