Begin typing your search above and press return to search.

సూర్య కూడా లోకల్ పాపకే ఓటేశాడు

By:  Tupaki Desk   |   17 Oct 2016 4:53 AM GMT
సూర్య కూడా లోకల్ పాపకే ఓటేశాడు
X
సౌత్ లో సూపర్ స్పీడ్ లో ఉన్న భామ ఎవరు అంటే.. స్టార్ హీరోయిన్లలో రెండు మూడు పేర్లు వినిపిస్తాయి. ఇప్పుడిప్పుడే క్రేజ్ పెంచుకుని.. పక్క రాష్ట్రాల్లో కూడా పాగా వేసేందుకు సిన్సియర్ గా ట్రై చేస్తున్న ట్యాలెంటెడ్ బ్యూటీస్ లో.. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తుంది. అయితే మలయాళ కుట్టి కీర్తి సురేష్ అయితే.. రకుల్ కంటే స్పీడ్ ఎక్కువగానే చూపించేస్తోందని చెప్పాలి.

మలయాళం అండ్ తమిళ్ తో పాటు తెలుగు సినిమాలు కూడా చుట్టేస్తున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం తెలుగులో నానితో "నేను లోకల్"లో నటిస్తోంది. ఇప్పుడీ బ్యూటీకి కోలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చేసింది. ఇప్పటికే ధనుష్ కి జోడీగా కనిపించిన ఈ భామ.. ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యతో కూడా ఆఫర్ దక్కించేసుకుంది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో సూర్య నటిస్తున్న సినిమాకి కీర్తి సురేష్ ని ఫైనల్ చేసేశారు. ఈ మూవీలో హీరోయిన్ అంటూ.. దర్శకుడు విఘ్నేష్ శివన్ లవర్ నయనతార సహా ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. చివరకు ఈ ఛాన్స్ కీర్తి సురేష్ కే దక్కింది. కీర్తి బర్త్ డే సందర్భంగా హ్యాపీ బర్త్ డే చెప్పి మరీ.. కీర్తి ఎంట్రీపై నిర్మాతలు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.

హీరోయిన్ ని ఫైనల్ చేయడమే కాకుండా.. ఇప్పుడీ సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేయడం విశేషం. 'తానే సేరంధ కూట్టం' అనే టైటిల్ పై సూర్య-కీర్తిల సినిమా తెరకెక్కనుండగా.. తెలుగు వెర్షన్ కి టైటిల్ ఫిక్స్ చేసేంత దూరం కథ ఇంకా రాలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/