Begin typing your search above and press return to search.

పేరు లేకున్నా పేరొచ్చే పాత్రలో..

By:  Tupaki Desk   |   2 Jan 2018 6:30 PM GMT
పేరు లేకున్నా పేరొచ్చే పాత్రలో..
X
సినిమా కథను రూపొందించేటపుడే ఆయా పాత్రల తీరు అనుసరించి పేరు నిర్ణయించడం జరుగుతుంది. కానీ అసలు పేరే లేకుండా ఓ క్యారెక్టర్ ను డిజైన్ చేయడం అంటే కష్టమైన విషయమే. ఇలాంటి ఓ పాత్రను సృష్టించాడట దర్శకుడు విఘ్నేష్ శివన్.

టాలీవుడ్ లో సంక్రాంతికి అజ్ఞాతవాసి మూవీతో పవన్ కళ్యాణ్ కు జోడీగా కనిపించనున్న కీర్తి సురేష్.. ఇదే పండుగకు తమిళ జనాల ముందుకు కూడా వస్తోంది. సూర్య మూవీ తానా సేరెంద్ర కూట్టం చిత్రం పొంగల్ కు విడుదల కానుండగా.. ఇందులో హీరోయిన్ గా నటించింది కీర్తి. ఈ మూవీలో బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించనున్న ఈ భామ.. తన పాత్రకు పేరు కూడా ఉండదని చెబుతోంది. 'దర్శకుడు కథ చెబుతున్నపుడే ఎంతో ఆసక్తి కలిగింది. పేరు లేని పాత్రను డిజైన్ చేసిన తీరు నాకు తెగ నచ్చేసింది. దీంతో పాటు ఈ చిత్రంలో హీరో సూర్య. అందుకే రెండో ఆలోచన లేకుండా నటించేందుకు అంగీకరించాను' అంటోంది కీర్తి సురేష్.

సూర్య ఫాదర్ శివకుమార్ తో.. తన తల్లి మేనక మూడు సినిమాలలో జోడీ కట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంది కీర్తి సురేష్. తనకు చదువుకునే రోజుల నుంచి సూర్యతో కలిసి నటించాలనే కోరిక ఉండేదని.. ఇదే విషయాన్ని తన ఫ్రెండ్స్ దగ్గర చెప్పేదాన్నని అంటున్న కీర్తి సురేష్.. ఇప్పుడు ఆ కోరిక తీరినందుకు తెగ హ్యాపీగా ఉందని అంటోంది. మేనక స్నేహితురాళ్లలో ఒకరైన రమ్యకృష్ణ కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర చేయడం మరింత సంతోషం ఇచ్చిందని చెప్పింది కీర్తి.