Begin typing your search above and press return to search.

అన్నదమ్ముల ఫైటింగ్ తప్పేలా లేదే

By:  Tupaki Desk   |   19 Aug 2016 2:00 PM GMT
అన్నదమ్ముల ఫైటింగ్ తప్పేలా లేదే
X
త్వరలో విడుదలవ్వనున్న తమిళ కమర్షియల్ సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ మధ్యనే 'కబాలి' బాగా దెబ్బేయడంతో తమిళ మార్కెట్ అంతా డ్రై అయిపోయింది. పైగా ప్రేక్షకులు కూడా చాలా నిరాశలో ఉన్నారు. అందుకే త్వరలో వచ్చే సినిమాలన్నీ అక్కడ పెద్ద రేంజులో కొట్టేస్తాయనే అంచనాలు ఊపందుకున్నాయి. ఈ రెండు నెలలూ వదిలేస్తే.. అక్టోబర్ చివర్లో వచ్చే దీపావళి సీజన్ మాత్రం తమిళ హీరోలకు చాలా కీలకం.

ఆ సీజన్లో ముందుగా ధనుష్‌ తన ''కోడి'' సినిమాను దించుతున్నాడు. అయితే ఈ సినిమాకు పోటీగా మరో ప్రక్కన హీరో సూర్య నటించిన ''సింగం 3'' సినిమా కూడా వస్తోంది. ఈ పోలీస్ పాత్రలో ఇప్పటికే రెండుసార్లు సూర్య తన స్టామినా చాటేశాడు కాబట్టి ఇప్పుడు కూడా అతడి మీద మాంచి అంచనాలే ఉన్నాయి. ఇకపోతే వీరిద్దరికీ పోటీగా కార్తీ కూడా తన ''కాష్మోరా'' సినిమాను తెస్తున్నాడట. అయితే సూర్య అండ్ కార్తీ అన్నదమ్ములు కాబట్టి.. ఇద్దరిలో ఎవరైనా తగ్గుతారేమో అనుకుంటే.. ఎందుకు మా సినిమాలను రెండూ ఒకేసారి ఎంజాయ్ చేయండి అంటూ వాళ్ళే చెప్పడం విశేషం.

ముఖ్యంగా సూర్య సంగతి ఏమోగాని.. కార్తిపైన మాత్రం చాలా అంచనాలు ఉన్నాయి. మనోడు బ్లాక్ బస్టర్ కొడితే తప్పించి ఈ సినిమా మీద పెట్టిన డబ్బులు తిరిగొచ్చే పరిస్థితి లేదు. అందుకే దీపావళి సీజన్ ను ఎంచుకుని.. బాక్సాఫీస్ దగ్గర అన్నయ్యతోనే ఫైటింగుకు దిగేస్తున్నాడు.