Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ని క్లీన్ చేయనివ్వరా? కోర్టుకెళ్లిన స్టార్లు.. నిర్మాతలపై కంగన ఎటాక్!!
By: Tupaki Desk | 13 Oct 2020 12:00 PM ISTప్రముఖ జాతీయ చానెల్ రిపబ్లిక్ సహా టైమ్స్ నవ్.. ఆ సంస్థల జర్నలిస్టులపై ఖాన్ ల త్రయం సహా 38 మంది ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి అంటూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించడం సంచలనమైంది. ఇందులో బాలీవుడ్ కి చెందిన అన్ని బడా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. దేశానికి ఎంతో ఆదాయం తెచ్చి పెడుతున్న బాలీవుడ్ పరువు మర్యాదల్ని మంట కలుపుతారా? అంటూ ప్రతి ఎటాక్ చేయడం అనేది దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇటీవల డ్రగ్స్.. నెపోటిజం.. సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసు సహా పలు అంశాలపై రిపబ్లిక్ చానల్ వరుస కథనాలతో స్టార్ల తిత్తి తీసింది. బాలీవుడ్ మాఫియాని ఏకి పారేసింది.
అయితే దీనివల్ల తమ పరువు పోయిందని స్టార్లు సహా నిర్మాణ సంస్థలన్నీ ఆరోపించడం వేడెక్కిస్తోంది. ప్రస్తుతం దిల్లీ హైకోర్టులో దీనిపై విచారణ సాగనుంది. అయితే బాలీవుడ్ మాఫియా అంటూ ఇంతకుముందు విమర్శల దాడి చేస్తూ రిపబ్లిక్ చానెల్ కి అండగా నిలిచిన కంగన రనౌత్ మరోసారి సదరు చానెల్ తరపున వకాల్తా పుచ్చుకోవడం అగ్గి రాజేస్తోంది.
బాలీవుడ్ నుండి పెద్ద సమ్మెలో, పెద్ద నిర్మాణ సంస్థలు రెండు న్యూస్ ఛానెళ్లపై పరువు నష్టం కేసులు నమోదు చేయడంపై నా.. సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యం పట్ల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మణికర్ణిక నటి # బాలీవుడ్ స్ట్రైక్స్ బ్యాక్ తో ట్వీట్ చేయడం కలకలం రేపింది. మాదకద్రవ్యాలు.... దోపిడీ... స్వపక్షపాతంను ఎలా బహిర్గతం చేయగలరు? పరువు నష్టం అంటే ఎలా? అని ప్రశ్నించారు.
కంగనా తాను బతికి ఉన్నంతవరకు వారందరినీ బహిర్గతం చేస్తానని సవాల్ విసిరారు. పెద్ద హీరోలు మహిళలను ఆబ్జెక్టిఫై చేయడమే కాకుండా యువతులను దోచుకుంటున్నారు. పెద్ద హీరోలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి యువకులను పైకి రానివ్వరని...., 50 ఏళ్ళ వయసులో వారు ఇంకా స్కూల్ పిల్లల్లా తెరపై ఆడాలని కోరుకుంటున్నారని క్వీన్ మరోసారి ఫిరంగులు విసిరారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు..., డ్రగ్స్.. బెదిరింపు... ఒంటరితనం వంటి పదాలతో # బాలీవుడ్ స్ట్రైక్స్ బ్యాక్ పై తన అసమ్మతిని వ్యక్తం చేయగా.. ఒకానొక సమయంలో ఆమె తనపై కూడా కేసు పెట్టుకోమని కోరడం వేడెక్కించింది. సుశాంత్ మరణం పేరిట బాలీవుడ్ లో చెత్తను శుభ్రం చేస్తే తప్పేంటి? అని కంగనా ప్రశ్నించింది. ఒక రకంగా ఆ 38 అగ్ర నిర్మాణ సంస్థల్ని .. ఖాన్ లను కూడా ఎటాక్ చేసారు డేరింగ్ అండ్ డాషింగ్ కంగన.