Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ బ‌హుమ‌తుల వెనుక మ‌త‌ల‌బు!

By:  Tupaki Desk   |   10 Jun 2022 11:30 PM GMT
క‌మ‌ల్ బ‌హుమ‌తుల వెనుక మ‌త‌ల‌బు!
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌లే 'విక్ర‌మ్-2' తో మ‌రో స‌క్సెస్ ని ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్లు గ్యాప్ త‌ర్వాత క‌మ‌ల్ ఖాతాలో ప‌డిన విజ‌యం ఇది. దీంతో క‌మ‌ల్ ఆనందానికి అవ‌ధుల్లేవ్. ఈ సినిమాని తానే స్వ‌యంగా నిర్మించ‌డంతో భారీగానే లాభాలు వ‌చ్చాయి. తెలుగులో సైతం సినిమా మంచి వ‌సూళ్ల‌ని సాధిస్తుంది.

దీంతో క‌మ‌ల్ దిల్ ఫుల్ ఖుషీ. ఇప్పుడా రెట్టించిన ఉత్సాహంలోనే విక్ర‌మ్-2 సినిమాకి ప‌నిచేసిన కీల‌క స‌భ్యులంద‌రికీ బ‌హుమ‌తులు అందించిన సంగ‌తి తెలిసిందే. దర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ కి ల‌గ్జ‌రీ కారుని గిప్ట్ గా ఇచ్చారు .దీని ధ‌ర కోటికి పైగానే ఉంటుంది. ఇంకా సినిమాకి ప‌నిచేసిన 13 మంది అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల‌కి అపాచీ న్యూ వెర్ష‌న్ ఆర్టీఆర్ 160 బైక్లు గిప్ట్ గా అందించారు.

ఒక్కో బైక్ ధ‌ర అక్ష‌రాలా1.45 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచ‌నా. క‌మ‌ల్ ఇదంతా సినిమాకొచ్చిన లాభాల ఆనందంతో చేసి ఉండొచ్చు. వాళ్ల క‌ష్టం వృద్ధా కాకూడ‌దు! అన్న‌ది మ‌రో కార‌ణంగా కూడా కావొచ్చు. కానీ ఇలాంటి వాటితో స‌ర్ ప్రైజ్ చేసి వాళ్ల‌లో దాగిన హిడెన్ ట్యాలెంట్ ని ఇంకా బ‌య‌ట‌కు వెలికి తీయాల‌న్న‌? క‌మ‌ల్ ఆలోచ‌న మాత్రం నిజంగా గొప్ప‌ద‌నే చెప్పాలి.

అవును ఈ విష‌యాన్ని క‌మ‌ల్ ప్ర‌త్య‌క్షంగా మీడియా ముఖంగా చెప్ప‌క‌పోయినా అదే వాస్త‌వంగా క‌నిపిస్తుంది. ఒక ఐడియాని ఎంక‌రేజ్ చేయ‌డం ఎంత గొప్ప విష‌య‌మో..అది స‌క్సెస్ అయిన త‌ర్వాత ఇలాంటి బ‌హుమ‌తుల రూపంలో ఏదైనా చేయ‌గ‌ల్గితే అత‌డిలో మ‌రింత ఉత్సాహాన్ని రెట్టింపు చేసిన‌ట్లు అవుతుంది. క‌మ‌ల్ అదే చేసారిప్పుడు.

క‌న‌గ‌రాజ్ క్రియేటివ్ డిపార్ట్ మెంట్ టీమ్ తో క‌లిసి ప్ర‌యాణం చేస్తే మ‌రిన్ని అద్భుతాలు సృష్టించ‌డానికి ఆస్కారం ఉంది. ఆ విష‌యాన్ని ప‌సిగ‌ట్టే క‌మ‌ల్ ఇలా స‌ర్ ప్రైజింగ్ గిప్ట్ ల‌తో 'విక్ర‌మ్ -2 ' బ్యాకెండ్ టీమ్ ని లాక్ చేసారు. గ‌తంలో క‌మ‌ల్ చాలా మంది ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసారు. వాటి ఫెయిల్యూర్స్..స‌క్సెస్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే వాళ్ల‌లో ఎవ‌రికి క‌మ‌ల్ ఇలాంటి ప్రోత్సాహకాలు అంందించ‌లేదు. ఆఛాన్స్ కేవ‌లం క‌న‌గ‌రాజ్ టీమ్ కే అన్న చందంగా తాజా స‌న్నివేశం క‌నిపిస్తుంది.

ఇప్ప‌టికే 'విక్ర‌మ్-3'ని ప్ర‌క‌టించేసారు. అందులో ప్ర‌ధాన విల‌న్ గా సూర్య న‌టిస్తున్నాడ‌ని సైతం క్లైమాక్స్ లో చెప్పేసారంటే 'ఖైదీ' ప్రాంచైజీపై ఎంత కాన్పిడెంట్ గా ఉన్నారో తెలుస్తుంది. ఈ ప్రాంచైజీ మొత్తంలో క‌మ‌ల్ కొన‌సాగే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. లొకేష్ లాంటి యువ ప్ర‌తిభావంతుడ్ని క‌మ‌ల్ ఏమాత్రం వదులుకునే అవ‌కాశం లేదు. అత‌నితో క‌లిసి ప్రయాణం చేస్తే మ‌రిన్ని వండ‌ర్స్ కి ఛాన్స్ ఉంది.